10.1-689-ఆ.
మమ్ముఁబెండ్లి చేయు మా ప్రాణవల్లభు
ప్రాణమిచ్చి కావు భక్తవరద!
నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు
పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు.
మమ్మున్ = మమ్ములను; పెండ్లిచేయుము
= పెళ్ళిచేయుము, కూర్చుము; మా = మా
యొక్క; ప్రాణవల్లభు = భర్త యొక్క; ప్రాణమున్
= ప్రాణమును; ఇచ్చి = ఇచ్చి; కావు =
కాపాడుము; భక్తవరద = కృష్ణా {భక్తవరదుడు
- భక్తుల కోరికలు తీర్చువాడు, విష్ణువు}; నీవు = నీవు; చేయు = చేసెడి;
పెండ్లి = పెళ్ళి, శుభము; నిత్యంబు = శాశ్వతమైనది; భద్రంబు = మేలైనది; పిన్ననాటి = మా చిన్నప్పటి; పెండ్లి = పెళ్శి;
పెళ్ళి = పెళ్ళి అని చెప్పదగినది; కాదు =
కాదు.
१०.१-६८९-आ.
मम्मुँबेंड्लि चेयु
मा प्राणवल्लभु
प्राणमिच्चि कावु
भक्तवरद!
नीवु चयु पेंड्लि
नित्यंबु भद्रंबु
पिन्ननाटि पेंड्लि
पेंड्लि कादु.
భక్తులకు
వరాలిచ్చే మహానుభావ! శ్రీకృష్ణ! మా ప్రాణప్రియుడైన కాళీయుడి ప్రాణాలు ప్రసాదించి,
అతనితో మాకు కల్యాణం చేయించు. చిన్నప్పుడు జరిగిన మా పెళ్ళి కల్యాణం
కాదు. ఇప్పుడు నీవు మాకు చేసేదే కల్యాణం శాశ్వతంగా ఉండేదీ, క్షేమకరమైనదీ.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment