10.1-673-వ.
కని దండప్రణామంబు లాచరించి
నిటలతటఘటిత కరకమలలై యిట్లనిరి.
10.1-674-క.
ధారుణిపై
నవతరించి తనరెడి నీ
కీ
క్రూరాత్ముని
దండించుట
క్రూరత్వము
గాదు సాధుగుణము గుణాఢ్యా!
కని = దర్శించి; దండప్రణామంబులు
= సాష్టాంగనమస్కారములు; ఆచరించి = చేసి;
నిటల = నొసటి; తట = ప్రదేశమున; ఘటిత = కూర్చబడిన; కర = చేతులు అనెడి; కమలలు = పద్మములు కలవారు; ఐ = అయ్యి; ఇట్లు = ఇలా; అనిరి = పలికిరి.
క్రూర = కఠినమైన; ఆత్ములన్
= మనసులు కలవారిని; దండింపగ = శిక్షించుటకు; ధారుణి = భూమి; పైన్ = మీద; అవతరించి
= పుట్టి; తనరెడి = ఒప్పునట్టి; నీ = నీ; కున్ = కు; ఈ = ఈ
యొక్క; క్రూరాత్ముని = కఠినాత్ముని;
దండించుట = శిక్షించుట; క్రూరత్వము =
కఠినత్వము; కాదు = కాదు; సాధుగుణము =
మృదుత్వము; గుణాఢ్యా = త్రిగుణసంపన్నుడా, కృష్ణా.
१०.१-६७३-व.
कनि दंडप्रणामंबु
लाचरिंचि निटलतटघटित करकमललै यिट्लनिरि.
१०.१-६७४-क.
"क्रूरात्मुल दंडिंपँग
धारुणिपै नवतरिंचि
तनरेडि नी की
क्रूरात्मुनि
दंडिंचुट
क्रूरत्वमु गादु
साधुगुणमु गुणाढ्या!
ఆ
నాగకాంతలు కృష్ణుని దర్శించి సాష్టాంగనమస్కారాలు చేసి, నుదుట
చేతులు జోడించి ఇలా అన్నారు: “సర్వగుణ సంపన్నుడవైన కృష్ణా! క్రూరులను
దండించడానికి అవతరించిన వాడవు నీవు. క్రూరుడైన కాళియుని శిక్షించుట నీ వీరత్వమే
గాని క్రూరత్వం కాదు.
ఇక్కడ నుండి సహజకవి
పోతనామాత్యులవారు స్త్రీలింగ సర్పజాతివారి నోట పలికించిన 18 మనోజ్ఞమైన పద్యగద్యలలో
ఎంతో పరిపక్వతను ఆధ్యాత్మికతను చొప్పించారు. . వీటిలో చివరి 4 పద్యగద్యలలో చూపిన
బుద్ధికుశలతతో కూడిన శబ్దార్థ గాంభీర్యాలు ప్రశంసనీయం. అల్పానల్పాలు బుద్ధికే కాని
పరబ్రహ్మకు లేవు అని పోతన్న భావనేమో.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment