10.1-686-ఉ.
నేరము లెన్న
నెక్కడివి? నేము దలంచు
తలంపు లోపలన్
నేరుపు
లున్నవే? సుతుల నేరమిఁ
దండ్రులు ద్రోచిపుచ్చరే?
నేరము చేయువారి
ధరణీపతు లొక్కకమాటు గావరే?
నేరము గల్గు
మద్విభుని నే డిటఁ గావఁగదే కృపానిధీ!
నేరములు = తప్పులు (శిక్షించదగినవి);
ఎన్నన్ = తరచిచూసినచో; ఎక్కడివి = ఎక్కడ
ఉన్నవి; నేము = మేము; తలంచు = తలచెడి;
తలంపులు = ఆలోచనలు; అందులోన్ = అన్నిటిలోని;
నేరుపులు = చతురత్వములు, నేర్పులు; ఉన్నవే = ఉన్నాయా, లేవు; సుతుల
= కొడుకుల; నేరమున్ = తప్పును; తండ్రులు
= తండ్రులు; త్రోసిపుచ్చరే = విడిచిపెట్టరా, విడిచెదరు; నేరము = తప్పు;
చేయు = చేసెడి; వారిన్ = వారిని; ధరణీపతులు = రాజులు; ఒక్కొక్క = ఒక్కొక్క; మాటు = సారి; కావరే = క్షమించరా; నేరము = తప్పు; కల్గు = చేసినట్టి; మత్ = మా యొక్క; విభుని = భర్తను; నేడు = ఇవాళ; ఇటన్ = ఇక్కడ; కావగదే
= కాపాడుము; కృపానిధీ = దయాసాగరా, కృష్ణా.
१०.१-६८६-उ.
नेरमु लेन्न
नेक्कडिवि? नेमु दलंचु तलंपु
लोपलन्
नेरुपु लुन्नवे? सुतुल नेरमिँ
दंड्रुलु द्रोचिपुच्चरे?
नेरमु चेयुवारि
धरणीपतु लोक्ककमाटु गावरे?
नेरमु गल्गु
मद्विभुनि ने डिटँ गावँगदे कृपानिधी!
దయాసాగరా!
కృష్ణా! మేము చేసే ఆలోచనలలో నేర్పులన్నవి లేవు కదా! నీ సన్నిదిలో నేరాలు అంటూ
ఏముంటాయి? పిల్లలు తప్పులు చేస్తే తండ్రులు క్షమించరా!
రాజులు కూడ ఒక్కొక్కసారి నేరంచేసేవారిని కూడ క్షమిస్తుంటారు కదా! నేరం చేసిన మా
భర్త కాళియుడుని క్షమించు. నీవు కరుణకు పుట్టిల్లు వంటివాడవు కదా! కాపాడు తండ్రీ!
ఆహా నాగకన్యలా వారు? ఏమి పలికించావయ్యా పోతనామాత్యా వారి నోటివెంట? చేసింది
నేరమే అనటంలో నేరము నేరము అంటూ, మేము నేరము (చేతకాని వాళ్ళం) అని ధ్వనింప జేస్తూ, శిక్షిస్తున్న
కృష్ణభగవానునికి, వదిలిపెట్టమని అడుగుతున్నారు. ఇంతటి నేర్పులు గల వీరెంతటి విజ్ఞులో
కదా. ప్రాసాలంకారం చేసిన, పోతన్న నేర్పులు ఎన్న గలమా. .
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment