Sunday, November 1, 2015

ప్రహ్లాద చరిత్ర - గుణనిధి

7-120-కంద పద్యము
గునిధి యగు ప్రహ్లాదుని
గుము లనేకములు గలవు గురుకాలమునన్
ణుతింప నశక్యంబులు
ణిపతికి బృహస్పతికిని భాషాపతికిన్.
7-121-వచనము
ఇట్లు సద్గుణగరిష్ఠుం డయిన ప్రహ్లాదుండు భగవంతుం డయిన వాసుదేవుని యందు సహజ సంవర్ధమాన నిరంతర ధ్యానరతుండై.
         ఆ సుగుణాలగని అయిన ప్రహ్లాదుడి గుణములు వివరించి చెప్ప నలవికాదు. అతని అనంత సుగుణాలను ఎన్నాళ్ళు వర్ణించినా ఆదిశేషుడు, బృహస్పతి, బ్రహ్మ మొదలగువారు కూడ వర్ణించలేరు.
         ఇలా గొప్ప సద్గుణాలు కల ప్రహ్లాదుడు ఎప్పుడు సహజసిద్ధంగా భక్తితో భగవంతుడూ, ఆత్మలో వసించేవాడూ అయిన శ్రీకృష్ణుని ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉండేవాడు. అతని హరి భక్తి నానాటికి అతిశయిస్తూ ఉండేది.
७-१२०-कंद पद्यमु
गुणनिधि यगु प्रह्लादुनि
गुणमु लनेकमुलु गलवु गुरुकालमुनन्
गणुतिंप नशक्यंबुलु
फणिपतिकि बृहस्पतिकिनि भाषापतिकिन्.
७-१२१-वचनमु
इट्लु सद्गुणगरिष्ठुं डयिन प्रह्लादुंडु भगवंतुं डयिन वासुदेवुनि यंदु सहज संवर्धमान निरंतर ध्यानरतुंडै.
          గుణ = సుగుణములకు; నిధి = నిక్షేపము వంటివాడు; అగు = అయిన; ప్రహ్లాదునిన్ = ప్రహ్లాదుని; గుణముల్ = సుగుణములు; అనేకములు = చాలా ఎక్కువ; కలవు = ఉన్నవి; గురు = పెద్ద; కాలమునన్ = కాలములోనైనను; గణుతింపన్ = వర్ణించుటకు; అశక్యంబులు = సాధ్యములుకావు; ఫణిపతి = ఆదిశేషుని {ఫణిపతి - ఫణి (సర్పములకు) పతి (రాజు), ఆదిశేషుడు}; కిన్ = కి; బృహస్పతి = బృహస్పతి; కిని = కిని; భాషాపతి = బ్రహ్మదేవుని {భాషాపతి - భాషా (భాషకి దేవత సరస్వతి) యొక్క పతి (భర్త), బ్రహ్మ}; కిన్ = కి.
          ఇట్లు = విధముగ; సద్గణ = సుగుణములచే; గరిష్ఠుండు = గొప్పవాడు; అయిన = ఐన; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; భగవంతుండు = మహిమాన్వితుండు; అయిన = ఐన; వాసుదేవుని = నారాయణుని {వాసుదేవుని - వసుదేవుని యొక్క పుత్రుడు, శ్రీకృష్ణుడు}; అందున్ = ఎడల; సహజ = తనంతతనే; సంవర్ధమాన = పుట్టిపెరిగిన; నిరంతర = ఎడతెగని; ధ్యాన = ధ్యానమునందు; రతుండు = తగిలినవాడు; = అయ్యి.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: