Tuesday, October 6, 2015

కాళియ మర్దన - బహు కాలంబు

10.1-678-మ.
హు కాలంబు తపంబు చేసి వ్రతముల్ పాటించి కామించి నీ
నీయోజ్వల పాదరేణుకణసంస్పర్శాధికారంబు శ్రీ
హిళారత్నము తొల్లి కాంచెనిదె నేమం బేమియున్ లేక నీ
హి నీ పాదయుగాహతిం బడసె నే త్యద్భుతం బీశ్వరా!
          బహు = చాల; కాలంబు = కాలము; తపంబున్ = తపస్సు; చేసి = చేసి; వ్రతముల్ = వ్రతములు; పాటించి = ఆచరించి; కామించి = కోరి; నీ = నీ; మహనీయ = గొప్ప; ఉజ్వల = ప్రకాశవంతమైన; పాద = పాదముల; రేణు = ధూళి; కణ = లేశము; సంస్పర్శ = సోకునట్టి; అధికారంబు = అర్హతను; శ్రీమహిళారత్నము = లక్ష్మీదేవి; తొల్లి = పూర్వము; కాంచెన్ = పొందెను; ఇదె = ఇదిగో; నేమంబు = నియమములు; ఏమియున్ = ఏమికూడ; లేకన్ = లేకుండగనే; ఈ = ఈ యొక్క; అహి = సర్పము; నీ = నీయొక్క; పాద = పాదముల; యుగ = జంట యొక్క; హతిన్ = దెబ్బలను; పడసె = పొందెను; నేడు = ఇవాళ; అతి = మిక్కిలి; అద్భుతంబు = ఆశ్చర్యకరము; ఈశ్వరా = కృష్ణా.
१०.-६७८-.
बहु कालंबु तपंबु चेसि व्रतमुल् पाटिंचि कामिंचि नी
महनीयोज्वल पादरेणुकणसंस्पर्शाधिकारंबु श्री
महिळारत्नमु तोल्लि कांचेनिदे नेमं बेमियुन् लेक नी
यहि नी पादयुगाहतिं बडसे ने डत्यद्भुतं बीश्वरा!
            దేవా? కృష్ణా? పూర్వం లక్ష్మీదేవి ఎంతోకాలం తపస్సు చేసి, పట్టుదలగా వ్రతా లనేకం చేసి, గొప్ప తేజస్సుతో ప్రకాశించే నీ పాదరేణువుల లోని కణాన్ని తాకేటట్టి అర్హత సంపాదించు కొంది. ఆహా! అలాంటిది ఈ సర్పరాజు ఏ తపస్సు చేయకుండానే నీ రెండు పాదాల పవిత్ర స్పర్శకు నోచుకున్నాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: