Sunday, October 4, 2015

కాళియ మర్దన - నిగ్రహమె

10.1-676-క.
నిగ్రహమె మము విషాస్యుల
నుగ్రుల శిక్షించు టెల్లనూహింప మహా
నుగ్రహము గాక మాకీ
నిగ్రహము విషాస్యభావనిర్గతిఁ జేసెన్.
          నిగ్రహమె = అడ్డగించుటె, కాదు; మమున్ = మమ్ములను; విష = విషముగల; ఆస్యులన్ = మోముగలవారము; ఉగ్రులన్ = భయంకరులను; శిక్షించుట = దండించుటలు; ఎల్లన్ = సమస్తము; మహా = గొప్ప; అనుగ్రహము = అనుగ్రహము; కాక = కాకుండగ; మా = మా; కున్ = కు; ఈ = ఈ యొక్క; నిగ్రహము = దండన; విష = విషపు; అస్య = ముఖముల; భావ = తత్వమునుండి; నిర్గతి = విడుదలౌటను; చేసెన్ = కలిగించెను.
१०.-६७६-.
निग्रहमे ममु विषास्युल
नुग्रुल शिक्षिंचु टेल्ल? नूहिंप महा
नुग्रहमु गाक माकी
निग्रहमु विषास्यभावनिर्गतिँ जेसेन्.
            మేము నోట్లో విషం కలిగిఉండేవాళ్ళం. తీవ్రమైన కోపం కలవాళ్ళం. అలాంటి మాలాంటి వారిని శిక్షించడం నిజానికి దండనే కాదు. అది మమ్మల్ని గొప్పగా అనుగ్రహించుటమే. ఈ శిక్ష వలన మా కున్న విషంకలవాళ్ళ మనే పొగరు దిగిపోయేలా చేసింది.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: