Sunday, October 18, 2015

కాళియ మర్దన - నీయాన



10.1-690-ఇం.
నీయా; యెవ్వారిని నిగ్రహింపం
డా యుగ్ర పాపాకృతి నంద డింకన్
నీ యాజ్ఞలో నుండెడు నేఁటఁగోలెన్ 
మా యీశు ప్రాణంబులు మాకు నీవే."
          నీ = నీమీద; ఆన = ఒట్టు; ఎవ్వారిని = ఎవరిని; నిగ్రహింపడు = బాధింపడు; ఆ = మునుపటి; ఉగ్ర = భయంకరమైన; పాప = పాపరూపమైన; ఆకృతిన్ = ఆకారమును; అందడు = చెందడు; ఇంకన్ = ఇకపైన; నీ = నీవు పెట్టెడి; ఆజ్ఞన్ = ఆజ్ఞకు; లోన్ = లోబడి; ఉండెడున్ = ఉండగలడు; నేట = ఇవాళ్టి; గోలెన్ = నుంచి; మా = మా యొక్క; ఈశు = భర్త; ప్రాణంబులున్ = ప్రాణములను; మా = మా; కున్ = కు; ఈవే = ఇమ్ము.
१०.१-६९०-इं.
नीयान; येव्वारिनि निग्रहिंपं
डा युग्र पापाकृति नंद डिंकन्;
नी याज्ञलो नुंडेडु नेँटँगोलेन्
मा यीशु प्राणंबुलु माकु नीवे."
            నీ మీద ఒట్టు; ఈ కాళియుడు ఇంకెవ్వరుని బాధపెట్టడు; ఇంకెప్పటికి భయంకరమైన పాపిష్టి రూపమెత్తడు; ఇవేళ్టి నుంచి నువ్వు చెప్పినట్లే నడచుకుంటాడు; మా భర్త ప్రాణాలను మాకు ప్రసాదించవయ్యా స్వామీ!.”
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: