Sunday, August 9, 2015

బ్రహ్మవరములిచ్చుట - కల్పాంతమున

7-87-సీస పద్యము
ల్పాంతమున నంధకారసంవృత మైన; గము నెవ్వఁడు దన సంప్రకాశ
ము వెలిగించుచు మూఁడుభంగుల రజ;  స్సత్త్వతమోగుణహితుఁ డగుచుఁ
ల్పించు రక్షించుఁ డపటఁ బ్రహరించు; నెవ్వఁ డాద్యుఁడు సర్వహేతు వగుచు
శోభితుండై స్వయంజ్యోతియై యొక్కట; విలసిల్లు నెవ్వఁడు విభుత మెఱసి
7-87.1-ఆటవెలది
మయ మయిన మానప్రాణబుద్ధీంద్రి; ములతోడ నెవ్వఁ లఘు మహిమ
డరు నట్టి సచ్చిదానందమయునకు,; హితభక్తి నే స్కరింతు.
              బ్రహ్మదేవా! నీవు ప్రళయకాలమున చిమ్మచీకటిలో మునిగిన లోకానికి నీ స్వయం ప్రకాశంతో వెలుగు ఇస్తావు; రజోగుణ, సత్వగుణ, తమోగుణాలనే త్రిగుణాలచే మువ్విధాల లోకాన్ని పుట్టించి, పెంచి, నశింపజేస్తావు; మొదలు, మూలకారణం అంతా నువ్వే; నీ అంతట నువ్వే కేవలుడవై ప్రకాశిస్తూ ఉంటావు; కాలం ప్రకారం మనస్సు, ప్రాణాలు, బుద్ధి, ఇంద్రియాలతో కూడినవాడిగా తోస్తూ, మహామహిమతో గోచరముకాకుండా మెలుగుతుంటావు; అట్టి సచ్చిదానంద స్వరూపా! నీకు నమస్కారములు.
७-८७-सीस पद्यमु
कल्पांतमुन नंधकारसंवृत मैन;  जगमु नेव्वँडु दन संप्रकाश
मुन वेलिगिंचुचु मूँडुभंगुल रज; स्सत्त्वतमोगुणसहितुँ डगुचुँ
गल्पिंचु रक्षिंचुँ गडपटँ ब्रहरिंचु; नेव्वँ डाद्युँडु सर्वहॅतु वगुचु
शोभितुंडै स्वयंज्योतियै योक्कट; विलसिल्लु नेव्वँडु विभुत मेर्रसि
७-८७.१-आटवेलदि
समय मयिन मानसप्राणबुद्धींद्रि; यमुलतॉड नेव्वँ डलघु महिम
नडरु नट्टि सच्चिदानंदमयुनकु,; महितभक्ति नॅ नमस्करिंतु.
            కల్పాంతమునన్ = ప్రళయమునందు; అంధకార = చీకటి; సంవృతము = క్రమ్మినది; ఐన = అయిన; జగమున్ = జగత్తును; ఎవ్వడు = ఎవడైతే; తన = తన యొక్క; సంప్రకాశమునన్ = మిక్కిలి తేజస్సుచే; వెలిగించుచు = ప్రకాశింపజేయుచు; మూడు = మూడు (3); భంగులన్ = విధములుగ; రజస్ = రజస్సు; సత్త్వ = సత్వము; తమస్ = తమస్సు; గుణ = గుణములతో; సహితుండు = కూడినవాడు; అగుచున్ = అగుచు; కల్పించున్ = సృష్టించును; రక్షించున్ = పాలించును; కడపటన్ = చివరకు; ప్రహరించున్ = సంహరించును; ఎవ్వండు = ఎవడైతే; ఆద్యుండు = మూలకారణము; సర్వ = సమస్తమునకు; హేతువు = కారణభూతము; అగుచున్ = అగుచు; శోభితుండు = ప్రకాశించువాడు; = అయ్యి; స్వయం = తనకుతానే; జ్యోతి = వెలుగునది; = అయ్యి; ఒక్కటన్ = ఏకమాత్రుడై; విలసిల్లున్ = ప్రకాశించును; ఎవ్వడు = ఎవడైతే; విభుతన్ = ఠీవితో; మెఱసి = విలసిల్లి.
             సమయము = సమయము; అయిన = వచ్చినప్పుడు; మానస = మనస్సు; ప్రాణ = ప్రాణములు; బుద్ధి = బుద్ధి; ఇంద్రియముల = ఇంద్రియముల; తోడన్ = తోటి; అలఘు = గొప్ప; మహిమన్ = సామర్థ్యముతో; అడరున్ = అతిశయించును; అట్టి = అటువంటి; సచ్చిదానందమయున్ = బ్రహ్మదేవున {సచ్చిదానందమయుడు - సత్ (సత్య మైనది శాశ్వతమైనది) చిత్ (శుద్ధ చైతన్యమైనది) ఆనంద (ఆనందము) లతో మయుండు(నిండినవాడు), బ్రహ్మ}; కున్ = కు; మహిత = గొప్ప; భక్తిన్ = భక్తితో; నేన్ = నేను; నమస్కరింతు = నమస్కరించెదను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: