Monday, August 3, 2015

బ్రహ్మవరములిచ్చుట - ఓ సురారికులేంద్ర

7-81-మత్తకోకిలము
ఓ! సురారికులేంద్ర! నీ క్రియ నుగ్రమైన తపంబు మున్
చేసి చూపినవారు లే; రిఁకఁ జేయువారును లేరు; నే
నీ మాధికి మెచ్చితిన్ విను నీ యభీష్టము లిత్తు నా
యామేటికి లెమ్ము లెమ్ము మహాత్మ! కోరుము కోరికల్
          ఓ రాక్షసకులోత్తముడవైన హిరణ్యకశిప! నువ్వు చేస్తున్నంత ఉగ్రమైన తపస్సు ఇంతకు పూర్వం ఎవరూ చేసినవారు ఎవరూ లేరు. ఇకముందు ఎవరూ చేయలేరు. నీ తపో దీక్షకు మెచ్చుకుంటున్నాను. కోరిన కోరికలు ఇస్తాను. ఇంకా కష్టపడి తపస్సు చేయటం ఆపెయ్యి. వరాలు కోరుకో ఇస్తాను.  
७-८१-मत्तकोकिलमु
ओ! सुरारिकुलॅएंद्र! नी क्रिय नुग्रमैन तपंबु मुन
चेसि चूपिनवारु ले; रिँकँ जेयुवारुनु लेरु; ने
नी समाधिकि मेच्चितिन विनु नी यभीष्टमु लित्तु ना
यास मेटिकि लेम्मु लेम्मु महात्म! कोरुमु कोरिकल
          ఓ = ; సురారికులేంద్రా = హిరణ్యకశిపుడా {సురారికులేంద్రుడు - సుర (దేవతల) అరి (శత్రువుల) కుల (వంశములన్ని టికి) ఇంద్ర (ప్రభువు), హిరణ్యకశిపుడు}; నీ = నీ; క్రియన్ = వలె; ఉగ్రము = తీవ్రమైనది; ఐన = అయిన; తపంబున్ = తపస్సును; మున్ = ఇంతకు పూర్వము; చేసి = చేసి; చూపిన = చూపించిన; వారు = వారు; లేరు = లేరు; ఇక = ఇకపైన; చేయు = చేయబోవు; వారును = వారు; లేరు = లేరు; నేన్ = నేను; నీ = నీ యొక్క; సమాధి = తపోసమాధి; కిన్ = కి; మెచ్చితిన్ = మెచ్చుకొంటిని; విను = వినుము; నీ = నీ; అభీష్టములు = కోరికలు; ఇత్తును = ఇచ్చెదను; ఆయాసము = శ్రమపడుట; ఏటికిన్ = ఎందులకు; లెమ్ము = లేచిరమ్ము; లెమ్ము = లేచిరమ్ము; మహాత్మ = గొప్పవాడ; కోరుము = కోరుకొనుము; కోరికల్ = కోరికలు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: