Saturday, August 15, 2015

బ్రహ్మవరములిచ్చుట - అని యిట్లమోఘంబు

7-93-వచనము
అని యిట్లమోఘంబు లయిన వరంబు లిచ్చి దితినందనుచేతం బూజితుండై యరవిందసంభవుండు బృందారకసందోహ వంద్యమానుం డగుచు నిజమందిరంబునకుం జనియె; ఇవ్విధమ్మున నిలింపారాతి వరపరంపరలు సంపాదించుకొని.
            అలా బ్రహ్మదేవుడు తిరుగులేని వరాలను  దితి కొడుకు హిరణ్యకశిపునికి ప్రసాదించాడుఅతనిచేత పూజలు పొంది, దేవతలు అందరి స్తుతి స్తోత్రాలు అందుకుంటూ స్వస్థలానికి వెళ్ళిపోయాడు. రాక్షసుడు ఇలా కోరుకున్న వరాలన్నీ పొందాడు. ఆపైన. . .
७-९३-वचनमु
अनि यिट्लमोघंबु लयिन वरंबु लिच्चि दितिनंदनुचेतं बूजितुंडै यरविंदसंभवुंडु बृंदारकसंदोह वंद्यमानुं डगुचु निजमंदिरंबुनकुं जनिये; इव्विधम्मुन निलिंपाराति वरपरंपरलु संपादिंचुकोनि.
          అని = అని; ఇట్లు = విధముగ; అమోఘంబులు = సఫలములైనవి; అయిన = ఐన; వరంబుల్ = వరములను; ఇచ్చి = ప్రసాదించి; దితినందనున్ = హిరణ్యకశిపుని {దితినందనుడు - దితియొక్కనంద నుడు (పుత్రుడు), హిరణ్యకశిపుడు}; చేతన్ = వలన; పూజితుండు = పూజింపబడినవాడు; = అయ్యి; అరవిందసంభవుండు = బ్రహ్మదేవుడు {అరవిందసంభవుడు - అరవిందము (పద్మము)నందు సంభవుండు (పుట్టినవాడు), బ్రహ్మ}; బృందారక = దేవతల; సందోహ = సమూహములచేత; వంద్యమానుండు = మ్రొక్కబడినవాడు; అగుచున్ = అగుచు; నిజ = తన; మందిరంబున్ = నివాసమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; = ; విధమ్మునన్ = విధముగ; నిలింపారాతి = హిరణ్యకశిపుడు {నిలింపారాతి - నిలింప (దేవతల) ఆరాతి (శత్రువు), హిరణ్యకశిపుడు}; వర = వరముల; పరంపరలు = సమూహములను; సంపాదించుకొని = పొంది.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: