Friday, August 21, 2015

బ్రహ్మవరములిచ్చుట - కోలాహలము

7-101-సీస పద్యము
కోలాహలము మాని కొలువుఁడీ సురలార!; లఁగి దీవింపుఁడీ పసులార!
ణు లెత్తకుఁడు నిక్కి న్నగేంద్రములార!; ప్రణతులై చనుఁడి దిక్పాలులార!
గానంబు చేయుఁడీ గంధర్వవరులార!; సందడిఁ బడకుఁడీ సాధ్యులార!
యాడుఁడీ నృత్యంబు ప్సరోజనులార!; చేరిక మ్రొక్కుఁడీ సిద్ధులార!
7-101.1-తేటగీతి
శుద్ధకర్పూర వాసిత సురభిమధుర; వ్య నూతన మైరేయపాన జనిత
సుఖవిలీనత నమరారి సొక్కినాఁడు; శాంతి లేదండ్రు నిచ్చలుఁ జారు లధిప!
            ఓ ధర్మరాజా! ఆ రాక్షసరాజు సేవకులు ప్రభువు స్వచ్ఛమైన పచ్చ కర్పూరపు వాసనలతో గమగమలాడే మనోజ్ఞమైన మాంచి తియ్యని సరికొత్త మధ్యం సేవించాడు. ఆ ఆనందంలో సోలిపోతున్నాడు, పూర్తి అశాంతితో తూలిపోతున్నాడు. అని చెప్తూదేవతలారా! గొడవ చేయకుండా నిశబ్దంగా సేవించుకోండి; ఓ మునుల్లారా! పక్కకి తప్పుకొని నిలబడి ఆశీర్వచనాలు పలకండి; నాగరాజులూ! పడగలు ఎత్తకండి; దిక్పాలురూ! మీరు మర్యాదతో వంగి నడవండి; గంధర్వులూ! పాటలు పాడండి; గోల చేయకండి సాధ్యులారా! మీరు అందరు నాట్యాలు చేయండి అప్సరసల్లారా! ఓ సిద్ధులూ! ఇలా దగ్గరకి వచ్చి ప్రభువుకు మొక్కుకోండి అంటూ నిత్యం అందరి మీద హడావిడి చేస్తున్నారు.
७-१०१-सीस पद्यमु
कोलाहलमु मानि कोलुवुँडी सुरलार!; तलँगि दीविंपुँडी तपसुलार!
फणु लेत्तकुँडु निक्कि पन्नगेंद्रमुलार!; प्रणतुलै चनुँडि दिक्पालुलार!
गानंबु चेयुँडी गंधर्ववरुलार!; संदडिँ बडकुँडी साध्युलार!
याडुँडी नृत्यंबु लप्सरोजनुलार!; चेरिक म्रोक्कुँडी सिद्धुलार!
७-१०१.१-तेटगीति
शुद्धकर्पूर वासित सुरभिमधुर; भव्य नूतन मैरेयपान जनित
सुखविलीनत नमरारि सोक्किनाँडु; शांति लेदंड्रु निच्चलुँ जारु लधिप!
          కోలాహలము = అల్లరి, గొడవచేయుట; మాని = మానేసి; కొలువుఁడీ = సేవించండి; సురలార = దేవతలారా; తలగి = దూరముగాపోయి, తొలగి; దీపింపుడీ = ఆశీర్వదించండి; తపసులారా = తాపసులారా; ఫణులు = పడగలు; ఎత్తకుడు = ఎత్తకండి; నిక్కి = సాగదీసుకొని; పన్నగ = నాగులల; ఇంద్రములారా = ఉత్తములారా; ప్రణతులు = వంగినవారు; = అయ్యి; చనుడి = వెళ్ళండి; దిక్పాలకులారా = దిక్పాలురులారా; గానంబు = పాటలు పాడుట; చేయుడీ = చేయండి; గంధర్వ = గంధర్వులలో; వరులార = శ్రేష్ఠులారా; సందడి = చప్పుడు చేస్తూ గుంపులు; పడకుడీ = కట్టకండి; సాధ్యులార = సాధ్యులార; ఆడుడీ = ఆడండి; నృత్యంబుల్ = నాట్యములను; అప్సరసః = అప్సరసలైన; జనులారా = ప్రజలారా; చేరి = దగ్గరకు వచ్చి; ఇక = ఇప్పుడు; మ్రొక్కుడీ = నమస్కరించండి; సిద్ధులారా = సిద్దులూ.
           శుద్ధ = స్వచ్ఛమైన; కర్పూర = పచ్చ కర్పూరపు; వాసిత = వాసనకలిగిన; సురభి = మనోజ్ఞమైన; మధుర = తీయనైన; భవ్య = మంచి; నూతన = కొత్త; మైరేయ = మధ్యము; పాన = తాగుటచే; జనిత = కలిగిన; సుఖవిలీనతన్ = కైపుచేత; అమరారి = రాక్షసుడు; సొక్కినాడు = మైమరచినాడు; శాంతి = నెమ్మది; లేదు = లేదు; అండ్రు = అంటున్నారు; నిచ్చలున్ = నిత్యము; చారులు = సేవకులు; అధిప = రాజా.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: