7-102-శార్దూల
విక్రీడితము
లీలోద్యాన
లతా నివాసములలో లీలావతీయుక్తుఁడై
హాలాపానవివర్ధమాన
మదలోలావృత్త తామ్రాక్షుఁడై
కేళిం దేలఁగ నేనుఁ దుంబురుఁడు సంగీతప్రసంగంబులన్
వాలాయంబుఁ
గరంగఁ జేయుదుము దేవద్వేషి నుర్వీశ్వరా!
ఓ మహారాజా! దేవతల శత్రువు అయిన హిరణ్యకశిపుడు లీలావతి మహారాణి తో కూడి పొదరిళ్ళ యందు
విలాసాల్లో తేలుతున్నాడు. ఇంకా మధ్యం తాగిన మత్తుతో వాడి ఎర్రని కళ్ళు పెద్దవి
అయ్యాయి, గుండ్రంగా తిరుగున్నాయి. అలాంటప్పుడల్లా, వాడిని మా సంగీత ఆలాపనలతో
తుంబురుడు, నేను శాంతింప జేస్తూ ఉంటాం.
७-१०२-शार्दूल विक्रीडितमु
लीलोद्यान लता निवासमुलल
लीलावतीयुक्तुँडै
हालापानविवर्धमान मदलोलावृत्त
ताम्राक्षुँडै
केळिं देलँग नेनुँ दुंबुरुँडु
संगीतप्रसंगंबुलन्
वालायंबुँ गरंगँ जेयुदुमु
देवद्वेषि नुर्वीश्वरा!
లీలోద్యాన = శృంగారపు పూతోటలోని; లతా = తీగ; నివాసముల = పొదరిళ్ళ; లోన్ = అందు; లీలావతీ = లీలావతితో {లీలావతి - హిరణ్యకశిపుని
భార్య}; యుక్తుడు = కూడినవాడు; ఐ = అయ్యి; హాలా = కల్లు, మధ్యము; పాన = తాగుటచే; వివర్ధమాన = పెద్దవియైన; మద = మత్తెక్కి; లోలావృత = గుండ్రముగాతిరుగుచున్న; తామ్ర = ఎర్రని; అక్షుడు = కన్నులుగలవాడు; ఐ = అయ్యి; కేళిన్ = విలాసములలో; తేలగా = తేలుతుండగా; నేనున్ = నేను; తుంబురుడు = తుంబురుడు; సంగీత = సంగీతపు; ప్రసంగంబులన్ = ఆలాపనలతో; వాలాయంబున్ = ఎల్లప్పుడును; కరగన్ = శాంతించి కరిగిపోవునట్లు; చేయుదుము = చేసెదము; దేవద్వేషిన్ = హిరణ్యకశిపుని {దేవద్వేషి - దేవతల యెడ ద్వేషముగల
వాడు, హిరణ్యకశిపుడు}; ఉర్వీశ్వరా = రాజా {ఉర్వీశ్వరుడు - ఉర్వి
(భూమి)కి ఈశ్వరుడు (ప్రభువు), రాజు}.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment