Saturday, August 29, 2015

కాళియ మర్దన - అనిన

10.1-633-వ.
అనిన “నయ్యగాధజలంబుల వలన మాధవుం డెట్టి నేర్పున సర్పంబు దర్పంబు మాపి వెడలించె, నందుఁ బెద్దకాలంబా వ్యాళం బేల యుండె? నెఱిగింపుము.
          అనినన్ = అనగా; ఆ = ఆ; అగాధ = మిక్కిలి లోతుగల; జలంబుల = నీటి; వలన = నుండి; మాధవుండు = కృష్ణుడు; ఎట్టి = ఎటువంటి; నేర్పునన్ = నేర్పుచేత; సర్పంబు = ఆ పాము యొక్క; దర్పంబున్ = మదమును; మాపి = పోగొట్టి; వెడలించెన్ = వెడలగొట్టెను; అందున్ = ఆ నది యందు; పెద్దకాలంబు = చాలా కాలము నుండి; వ్యాళంబు = పాము; ఏల = ఎందుచేత; ఉండెన్ = ఉన్నది; ఎఱిగింపుము = తెలియ చెప్పుము.
१०.१-६३३-व.
अनिन “नय्यगाधजलंबुल वलन माधवुं डेट्टि नेर्पुन सर्पंबु दर्पंबु मापि वेडलिंचे, नंदुँ बेद्दकालंबा व्याळं बेल युंडे? नेर्रिगिंपुमु.
          అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు “ఆ అతి లోతైన మడుగులోని నాగరాజు కాళియుడి గర్వం లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు ఎలా అణచాడో. ఎలా వెళ్ళ గొట్టాడో? ఆ నేర్పు ఎలాంటిదో? అసలు అన్నాళ్ళు ఆ కాళిందిలో ఆ సర్పరాజు ఎందుకున్నాడో. నాకు చెప్పు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: