Monday, August 17, 2015

బ్రహ్మవరములిచ్చుట - ఒకనాడు

7-95-సీస పద్యము
కనాఁడు గంధర్వయూధంబుఁ బరిమార్చు; దివిజుల నొకనాఁడు దెరలఁ దోలు;
భుజగుల నొకనాఁడు భోగంబులకుఁ బాపు; గ్రహముల నొకనాఁడు ట్టివైచు;
నొకనాఁడు యక్షుల నుగ్రత దండించు; నొకనాఁడు విహగుల నొడిసిపట్టు;
నొకనాఁడు సిద్ధుల నోడించి బంధించు; నుజుల నొకనాఁడు మడంచు;
7-95.1-తేటగీతి
డిమి నొకనాఁడు కిన్నర చర సాధ్య; చారణప్రేత భూతపిశా వన్య
త్త్వ విధ్యాధరాదుల సంహరించు; దితితనూజుండు దుస్సహతేజుఁ డగుచు.
              దైత్యుడు హిరణ్యకశిపుడు ఒకరోజు తేరిచూడలేని పరాక్రమం కల వాడు అయి, ఒకరోజు గంధర్వులను చావగొడతాడు. ఇంకొక రోజు దేవతలను తరుముతాడు. మరొక రోజు నాగులను సంహరిస్తాడు. మరొక నాడు నవ గ్రహాలను కట్టేస్తుంటాడు. ఇంకో నాడు యక్షులను తీవ్రంగా బాధిస్తాడు. ఒక రోజు పక్షులను ఎగురనీయకుండ పట్టుకుంటాడు. ఒకనాడు సిద్ధులను జయించి చెరపడతాడు. మరో రోజు మానవులను భయపెడతాడు. ఒక్కొక్క నాడు కిన్నరులను, ఖేచరులను, చారణులను, భూత ప్రేత పిశాచాలను, అడవి మృగాలను, విద్యాధరులను చావగొడుతూ ఉంటాడు
७-९५-सीस पद्यमु
ओकनाँडु गंधर्वयूधंबुँ बरिमार्चु; दिविजुल नोकनाँडु देरलँ दलु;
भुजगुल नोकनाँडु भोगंबुलकुँ बापु; ग्रहमुल नोकनाँडु गट्टिवैचु;
नोकनाँडु यक्षुल नुग्रत दंडिंचु; नोकनाँडु विहगुल नोडिसिपट्टु;
नोकनाँडु सिद्धुल नोडिंचि बंधिंचु; मनुजुल नोकनाँडु मद मडंचु;
७-९५.१-तेटगीति
गडिमि नोकनाँडु किन्नर खचर साध्य; चारणप्रेत भूतपिशाच वन्य
सत्त्व विध्याधरादुल संहरिंचु; दितितनूजुंडु दुस्सहतजुँ डगुचु.
            ఒకనాడు = ఒకరోజు; గంధర్వ = గంధర్వుల; యూధంబున్ = సమూహములను; పరిమార్చున్ = సంహరించును; దివిజులన్ = దేవతలను {దివిజులు - దివి (స్వర్గమున) ఉండువారు, దేవతలు}; ఒకనాడు = ఒకరోజు; తెరలన్ = చెదిరిపోవునట్లు; తోలున్ = తరుమును; భుజగులన్ = నాగలోకవాసులను; ఒకనాడు = ఒకరోజు; భోగంబుల్ = భోగములను; పాపు = దూరము చేయును; గ్రహములన్ = గ్రహములను; ఒకనాడు = ఒకరోజు; కట్టివైచున్ = కట్టవేయును; ఒకనాడు = ఒకరోజు; యక్షులన్ = యక్షులను; ఉగ్రతన్ = తీవ్రతన్; దండించున్ = శిక్షించును; ఒకనాడు = ఒకరోజు; విహగులన్ = పక్షులను; ఒడిసిపట్టున్ = ఒడిసి పట్టుకొనును; ఒకనాడు = ఒకరోజు; సిద్ధులన్ = సిద్ధులను; ఓడించి = ఓడించి; బంధించున్ = బంధించును; మనుజులన్ = మానవులను; ఒకనాడు = ఒకరోజు; మదమున్ = పొగరు; అడంచున్ = అణచును; కడిమిన్ = పరాక్రమముతో; ఒకనాడు = ఒకరోజు.
            కిన్నర = కిన్నరుల; ఖచర = ఖేచరుల; సాధ్య = సాధ్యుల; చారణ = చారణుల; ప్రేత = ప్రేతముల; భూత = భూతముల; పిశాచ = పిశాచముల; వన్యసత్త్వ = అడవి జంతువుల; విద్యాధర = విద్యాధరులు; ఆదుల = మొదలగువారిని; సంహరించున్ = చంపును; దితితనూజుండు = హిరణ్యకశిపుడు {దితితనూజుడు - దితి యొక్కతనూ జుడు (పుత్రుడు), హిరణ్యకశిపుడు}; దుస్సహ = భరింపశక్యముగాని; తేజుడు = తేజస్సుగలవాడు; అగుచున్ = అగుచు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=5
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: