7-94-కంద పద్యము
సోదరుఁ జంపిన పగ కై
యాదర మించుకయు లేక యసురేంద్రుఁడు కం
జోదరుపై వైరము దు
ర్మాదరతుం డగుచుఁ జేసె మనుజాధీశా!
ఓ ధర్మరాజా! ఇలా కొవ్వెక్కిన రాక్షసరాజు హిరణ్యకశిపుడు తన తమ్ముడిని చంపాడు అని పగబూని నీతిమాలి పద్మనాభస్వామి విష్ణుమూర్తి మీద విడువని శత్రుత్వం పెంచుకున్నాడు.
७-९४-कंद पद्यमु
सोदरुँ जंपिन पग कै
यादर मिंचुकयु लेक यसुरंद्रुँडु कं
जोदरुपै वैरमु दु
र्मादरतुं डगुचुँ जेसे मनुजाधीशा!
సోదరు = తమ్ముని; చంపిన = సంహరించిన; పగ = కక్ష; కై = కై; ఆదరము = మన్నన; ఇంచుకయున్ = కొంచముకూడ; లేక = లేకుండగ; అసురేంద్రుడు = హిరణ్యకశిపుడు {అసురేంద్రుడు - అసురుల (రాక్షసుల)కు ఇంద్రుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు}; కంజోదరు = నారాయణుని {కంజోదరుడు - కంజము (పద్మము) ఉదరమునగలవాడు, విష్ణువు}; పైన్ = మీద; వైరము = శత్రుత్వము; దుర్మాద = చెడ్డ మదమునందు; రతుండు = మిక్కిలి ఆపేక్షగలవాడు; అగుచున్ = అగుచు; చేసెన్ = చేసెను; మనుజాధీశ = రాజా {మనుజాధీశుడ - మనుజు (మానవు)లకు అధీశుడు, రాజు}.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment