Friday, August 14, 2015

బ్రహ్మవరములిచ్చుట - అన్నా

7-92-శార్దూల విక్రీడితము
న్నా! కశ్యపపుత్ర! దుర్లభము లీ ర్థంబు లెవ్వారికిన్;
మున్నెవ్వారలుఁ గోర రీ వరములన్; మోదించితిన్ నీ యెడన్
న్నుం గోరిన వెల్ల నిచ్చితిఁ బ్రవీత్వంబుతో బుద్ధి సం
న్నత్వంబున నుండు మీ సుమతివై ద్రైకశీలుండవై.
            కశ్యప పుత్రా! హిరణ్యకశిపా! విను, నువ్వు నన్ను అడిగిన వరాలు ఎవరికైనా పొందశక్యంకానివి. ఇలాంటి వరాలు ఇంతకు ముందు ఎవరూ కోరలేదు. నీ తపస్సుకు చాలా సంతోషించాను. నీ యందలి కరుణతో వరాలు అన్నీ (21 వరాలు) ప్రసాదిస్తున్నాను. నేర్పు, న్యాయం కలిగి మంచి బుద్ధితో మెలగుతూ బ్రతుకుము
annaa! kashyapaputra! durlabhamu lee yarthaMbu levvaarikin;
munnevvaaraluM~ gora ree varamulan; modiMchitin nee yeDan
nannuM gorina vella nichchitiM~ braveeNatvaMbuto buddhi saM
pannatvaMbuna nuMDu mee sumativai bhadraikasheeluMDavai.”
          అన్నా = అయ్యా; కశ్యపపుత్రా = హిరణ్యకశిపుడ {కశ్యపపుత్రుడు - కశ్యపుని పుత్రుడు}; దుర్లభములు = పొందరానివి; = ; అర్థంబులు = కోరబడినవి; ఎవ్వరికిన్ = ఎవరికైనను; మున్ను = ఇంతకు పూర్వము; ఎవ్వారలున్ = ఎవరునుకూడ; కోరరు = కోరలేదు; = ఇట్టి; వరములన్ = వరములను; మోదించితిన్ = సంతోషించితిని; నీ = నీ; యెడన్ = అందు; నన్నున్ = నన్ను; కోరినవి = కోరినట్టివి; ఎల్లన్ = అన్నియును; ఇచ్చితిన్ = ప్రసాదించితిని; ప్రవీణత్వంబు = నేరుపు; తోన్ = తోటి; బుద్ధి = జ్ఞానము యనెడి; సంపన్నత్వంబునన్ = సంపదతో; ఉండుమీ = ఉండుము; సుమతివి = మంచి బుద్ధిగలవాడవు; = అయ్యి; భద్ర = మంగళ; ఏక = ప్రధానమైన; శీలుండవు = స్వభావములుగలవాడవు; = అయ్యి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: