10.1-631-సీ.
ఒకనాడు బలభద్రుఁ డొక్కఁడు రాకుండ; గోపాలకులు దానుఁ గూడి
కృష్ణుఁ;
డడవికిఁ జని యెండ నా గోవులును గోప; కులు నీరుపట్టునఁ గుంది డస్సి
కాళిందిలో విషకలిత
తోయముఁ ద్రావి; ప్రాణానిలంబులు పాసి పడిన
యోగీశ్వరేశుండు యోగివంద్యుఁడు
గృష్ణుఁ; డీక్షణామృతధార లెలమిఁ
గురిసి
10.1-631.1-ఆ.
పశుల గోపకులను బ్రతికించె మరలంగ; వారుఁ దమకుఁ
గృష్ణువలన మరలఁ
బ్రతుకు గలిగెనంచు భావించి సంతుష్ట; మానసములఁ జనిరి మానవేంద్ర!
ఒక = ఒకానొక; నాడు =
దినమున; బలభద్రుడు = బలరాముడు; ఒక్కడు
= మాత్రము; రాకుండన్ = రాకుండగా; గోపాలకులున్
= యాదవులు; తానున్ = అతను; కూడి =
కలిసి; కృష్ణుడు = కృష్ణుడు; అడవి =
అడవి; కిన్ = కి; చని = వెళ్ళి; ఎండన్ = ఎండలో; ఆ
= ఆ; గోవులును = పశువులు; గోపకులున్ = యాదవులు;
నీరుపట్టునన్ = దాహముతో; కుంది = కుంగిపోయి;
డస్సి = బడలిక చెంది; కాళింది = యమున; లోన్ = అందు; విష = విషముతో; కలిత
= కూడిన; తోయమున్ = నీటిని; త్రావి =
తాగి; ప్రాణానిలంబులున్ = ప్రాణవాయువులు; పాసి = పోయి; పడినన్ = పడిపోగా; యోగి = యోగులలో; ఈశ్వర = శ్రేష్ఠులకు; ఈశుండు = ప్రభువు; యోగి = యోగులచే; వంద్యుడు = స్తుతింపబడువాడు; కృష్ణుడు = కృష్ణుడు;
ఈక్షణ = చూపులు అనెడి; అమృత = అమృతపు; ధారలు = జల్లులు; ఎలమిన్ = ప్రేమతో; కురిసి = కురిపించి;
పశులన్ = పశువులను; గోపకులనున్
= గొల్లవాండ్రను; బ్రతికించె
= జీవింపజేసెను; మరలంగ =
తిరిగి; వారున్
= వారుకూడ; తమ =
వారల; కున్ =
కు; కృష్ణు
= కృష్ణుని; వలన =
వలన; మరలన్ =
మళ్ళీ; బ్రతుకు
= జీవితము; కలిగెన్
= కలిగినది; అంచున్
= అని; భావించి
= తలచుకొని; సంతుష్ట
= సంతోషించిన; మానసములన్
= మనసులతో; చనిరి =
వెళ్ళిరి; మానవేంద్రా
= రాజా {మానవేంద్రుడు
- మానవులకు ప్రభువు, రాజు}.
१०.१-६३१-सी.
ओकनाडु बलभद्रुँ
डोक्कँडु राकुंड; गोपालकुलु दानुँ
गूडि कृष्णुँ;
डडविकिँ जनि येंड
ना गोवुलुनु गोप; कुलु नीरुपट्टुनँ
गुंदि डस्सि
काळिंदिलो विषकलित
तोयमुँ द्रावि; प्राणानिलंबुलु
पासि पडिन
योगीश्वरेशुंडु
यगिवंद्युँडु गृष्णुँ; डीक्षणामृतधार लेलमिँ गुरिसि
१०.१-६३१.१-आ.
पशुल गोपकुलनु
ब्रतिकिंचे मरलंग; वारुँ दमकुँ गृष्णुवलन मरलँ
ब्रतुकु गलिगेनंचु
भाविंचि संतुष्ट; मानसमुलँ जनिरि
मानवेंद्र!
శుకమహర్షి ఇంకా ఇలా చెప్పసాగేడు “ఓ పరీక్షిన్మహారాజా! ఒకరోజు కృష్ణుడు గోపాలకులు తాను కలిసి ఆవులను
తోలుకొని అడవికి వెళ్ళాడు. ఆ రోజున మాత్రం బలరాముడు వారితో వెళ్ళలేదు. ఆ వేళ ఎండ
తీవ్రతకి గోవులు, గోపాలకులు దాహంతో తపించిపోతు సొమ్మసిల్లి
పోసాగారు. వారు కాళింది అనే యమునా నది మడుగులోని విషపూరితమైన నీళ్ళు తాగి
ప్రాణవాయువులు కోల్పోయి పడిపోయారు. మహా యోగులకు ప్రభువు, యోగు
లందరికి వందనీయుడు అయిన శ్రీకృష్ణుడు తన చూపులనే గొప్ప అమృతం వర్షించి ఆ గోవులను,
గోపాలకులను మళ్ళీ బతికించాడు. వారంతా కృష్ణుడు తమకు పునర్జన్మ
ప్రసాదించాడని సంతోషించి ఇళ్ళకు వెళ్ళిపోయారు.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment