10.1-634-క.
తొఱ్ఱులఁ గాచిన
నందుని
కుఱ్ఱని
చరితామృతంబు గొనకొని
చెవులన్
జుఱ్ఱంగఁ దనివి
గల్గునె;
వెఱ్ఱుల కైనను
దలంప? విప్రవరేణ్యా! "
తొఱ్ఱులన్ = ఆవులను; కాచిన
= మేపెడి; నందుని = నందుని యొక్క; కుఱ్ఱని
= కుమారుని; చరిత = చరిత్ర అనెడి; అమృతంబున్
= అమృతమును; కొనకొని = పూని; చెవులన్ =
చెవులతో; జుఱ్ఱంగన్ = ఆసక్తితో పీల్చుకొనగా; తనివి = తృప్తి; కల్గునె = కలుగునా, కలుగదు; వెఱ్ఱుల్ = పిచ్చివాని; కిన్ = కి; ఐనను = అయినప్పటికి; తలంపన్ = తరచి చూసినచో; విప్ర = బ్రాహ్మణ; వరేణ్యా = శ్రేష్ఠుడా.
१०.१-६३४-क.
तोर्र्र्रुलँ गाचिन नंदुनि
कुर्र्र्रनि चरितामृतंबु
गोनकोनि चेवुलन्
जुर्र्र्रंगँ दनिवि गल्गुने;
वेर्र्र्रुल कैननु दलंप? विप्रवरेण्या! "
ఓ
బ్రహ్మణోత్తమా! శుకబ్రహ్మ! గోవులను కాచిన నందుని కుమారుని కథలనే సుధారసాన్ని
చెవులారా జుర్రుకుంటు ఆస్వాదిస్తున్న ఎంతటి వెర్రివాడైనా తృప్తిచెంది ఇంక చాలు
అనుకోగలడా? ఊహు అనుకోలేడు."
10.1-635-వ.
అనిన శుకుం డిట్లనియె.
అనినన్ = అనగా; శుకుండు =
శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె =
పలికెను.
అని
పరీక్షిన్మహారాజు అనగా, శుకమునీంద్రుడు ఇలా చెప్పసాగాడు.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment