Tuesday, August 11, 2015

బ్రహ్మవరములిచ్చుట - కోరినవారల

7-89-కంద పద్యము
కోరినవారలకోర్కులు
నేరుపుతో నిచ్చి మనుప నీ క్రియ నన్యుల్
నేరు కరుణాకర నేఁ
గోరె నీ విచ్చెదేనిఁ గోరిక లభవా!
            బ్రహ్మదేవుడా! దయాసాగరా! కోరినవారి వరాలను ప్రసాదించి పాలించుటలో నిన్ను మించిన వారు ఎవరూ లేరు. నువ్వు వరాలు ప్రసాదిస్తాను అంటున్నావు. అయితే, నేను నా కోరికలను కోరుకుంటాను.  
७-८९-कंद पद्यमु
कोरिनवारलकोर्कुलु
नेरुपुतो निच्चि मनुप नी क्रिय नन्युल
नेररु करुणाकर नेँ
गोरेद नी विच्चेदेनिँ गोरिक लभवा!
           కోరినవారల = కోరినవారి యొక్క; కోర్కులు = కోరికలు; నేరుపు = నేర్పు; తోన్ = తోటి; ఇచ్చి = ఇచ్చి; మనుప = సంరక్షించుటకు; నీ = నీ; క్రియన్ = వలె; అన్యుల్ = ఇతరులు; నేరరు = సమర్థులుగారు; కరుణాకర = దయాసముద్రుడ; నేన్ = నేను; కోరెదన్ = కోరుకోనెదను; నీవు = నీవు; ఇచ్చెద = ఇచ్చెదవు; ఏనిన్ = అయినచో; కోరికల్ = కోరికలను; అభవా = బ్రహ్మదేవుడా {అభవుడు - భవము (పుట్టుక) లేనివాడు, బ్రహ్మ}.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: