Friday, August 1, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 369

అలసులు

1-44-చ.
సులు మందబుద్ధియుతు ల్పతరాయువు లుగ్రరోగసం
లితులు మందభాగ్యులు సుర్మము లెవ్వియుఁ జేయఁజాల రీ
లియుగ మందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై
వడు? నేమిటంబొడమునాత్మకు? శాంతి మునీంద్ర! చెప్పవే.
          మునీంద్రా! సూతా! ఈ కలియుగంలోని మానవులందరు సోమరి పోతులు, మందబుద్ధులు, మందభాగ్యులు, అల్పాయుష్కులు. రకరకాల భయంకర వ్యాధులు వాళ్ళని పట్టి పల్లారుస్తున్నాయి. వాళ్ళు సత్కార్యా లేవైనా చేయటానికి అసమర్థు లౌతున్నారు. అందువల్ల వారి ఆత్మలకు ఏది శాంతిని ప్రసాదిస్తుందో అట్టి మార్గాన్ని అనుగ్రహించు.
శౌనకాది మునీశ్వరులు సూత మహర్షిని భాగవతం చెప్పమని ఇలా అడుగసాగారు. ఇక్కడ మానవులపై కలికాల ప్రభావం ప్రసిద్ధంగా విశ్లేషించబడింది.
1-44-cha.
alasulu maMdabuddhiyutu lalpataraayuvu lugrarOgasaM
kalitulu maMdabhaagyulu sukarmamu levviyu@M jaeya@Mjaala ree
kaliyugamaMdu maanavulu gaavuna neyyadi sarvasaukhyamai
yalavaDu? naemiTaMboDamunaatmaku? SaaMti muneeMdra! cheppavae.
          అలసులు = సోమరి పోతులు; మంద = మందగించిన; బుద్ది = బుద్ది; యుతులు = కలిగినవారు; అల్పతర = చాలా తక్కువ {అల్ప - అల్పతర - అల్పతమ}; ఆయువులు = ఆయుష్షు కలవారు; ఉగ్ర = భయంకరమైన; రోగ = రోగములతో; సంకలితులు = కూడిన ఉన్న వారు; మంద = మందగించిన; భాగ్యులు = భాగ్యము కలవారు; సుకర్మములు = మంచిపనులు; ఎవ్వియున్ = ఏవియును; చేయఁజాలరు = చేయలేరు; = ; కలియుగము = కలియుగము; అందున్ = లో; మానవులు = మనుషులు; కావునన్ = అందువలన; ఎయ్యది = ఏదైతే; సర్వ = అన్ని; సౌఖ్యము = సుఖములను కలుగజేయునది; = అయ్యి; అలవడున్ = సిద్ధించునో; ఏమిటన్ = దేనివలన; పొడమున్ = కలుగుతుందో; ఆత్మకు = ఆత్మకు; శాంతి = శాంతి; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్టుడా; చెప్పవే = చెప్పుము.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

1 comment:

Anonymous said...

Thank you for great services.