తలగవు
8-28-క.
తలఁగవు కొండలకైనను
మలఁగవు సింగములకైన మార్కొను కడిమిం
గలఁగవు పిడుగుల కైనను
నిల బలసంపన్న వృత్తి నేనుఁగు గున్నల్.
ఆ భూమిమీది ఏనుగు గున్నలు
అమిత బలసంపన్నతతో ఎదిరించే శక్తి కలిగి ఉండటంతో, కొండలనైనా ఢీ కొట్టడానికి
వెనుదీయవు, సింహాలనైనా సరే తప్పుకోకుండ ఎదిరించి నిలుస్తాయి, పిడుగుల నైనా
లెక్కజేయక ముందడుగు వేస్తాయి.
గజేంద్ర మోక్షంలోని గజరాజు
పరివారంలోని పిల్ల ఏనుగుల వర్ణన
8-28-ka.
tala@Mgavu
koMDalakainanu
mala@Mgavu
siMgamulakaina maarkonu kaDimiM
gala@Mgavu
piDugula kainanu
nila
balasaMpanna vRtti naenu@Mgu gunnal.
తలగవు = తొలగిపోవు; కొండల్ = కొండల; కైనన్ = కి
యయినను;
మలగవు = తప్పుకొనవు; సింగముల్ = సింహముల; కైనన్ = కి
యయినను;
మార్కొనున్ = ఎదిరించు
చుండును; కడిమిన్ = శౌర్యముతో; కలగవు = కలత చెందవు; పిడుగుల్ = పిడుగుల; కైనను = కి
యయినను;
ఇలన్ = భూమిపైన; బల = శక్తి; సంపన్న = సమృద్ధిగా
నుండు;
వృత్తిన్ = విధము యందు; ఏనుగు గున్నల్ = పిల్ల
యేనుగులు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment