Sunday, August 17, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 384

గర్భమందు

1-182-ఆ.
ర్భ మందుఁ గమలర్భాండశతములు
నిముడుకొన వహించు నీశ్వరేశ!
నీకు నొక్క మానినీగర్భరక్షణ
మెంత బరువు నిర్వహింతు గాక.
          గర్భంలో వందల కొద్దీ బ్రహ్మాండాలను భద్రంగా భరించే దేవాధిదేవ! నీకు ఒక ఆడదాని గర్భాన్ని రక్షించటం ఏమంత బ్రహ్మాండం. ఆపదలో ఉన్న నన్ను ఆదుకోవయ్యా!
అభిమన్యుని సతి ఉత్తరగర్భంలో ఉన్న పిండరూపంలో ఉన్న పరీక్షిత్తు అశ్వత్థామ బాణాగ్నికి కందిపోతుంటే శ్రీకృష్ణుని కాపాడమని ఇలా వేడుకోసాగింది.
1-182-aa.
garbha maMdu@M gamalagarbhaaMDaSatamulu
nimuDukona vahiMchu neeSvaraeSa!
neeku nokka maanineegarbharakshaNa
meMta baruvu nirvahiMtu gaaka.
          గర్భమందున్ = గర్భము లోపల; కమలగర్భఅండ = బ్రహ్మాండములు; శతములు = వందలు; నిముడుకొనన్ = ఇముడ్చుకొని; వహించు = ధరించు; ఈశ్వర = దేవతలలో; ఈశ = శ్రేష్ఠుడా; నీకు = నీకు; ఒక్క = ఒక్క; మానినీ = స్త్రీ యొక్క; గర్భ = గర్భమును; రక్షణము = రక్షించుట; ఎంత = ఏపాటి; బరువు = భారము; నిర్వహింతుగాక = తప్పక చేయుము (నాగర్భరక్షణ).

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: