Friday, August 8, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 375

తండ్రులకెల్ల

1-253-ఉ.
తండ్రుల కెల్లఁ దండ్రి యగు ధాతకుఁ దండ్రివి దేవ! నీవు మా
తండ్రివిఁ దల్లివిం బతివి దైవమవున్ సఖివిన్ గురుండ; వే
తండ్రులు నీ క్రియం బ్రజల న్యులఁ జేసిరి, వేల్పు లైన నో
తండ్రి భవన్ముఖాంబుజము న్యతఁ గానరు మా విధంబునన్.
          తండ్రు లందరికి తండ్రి యైన బ్రహ్మదేవునికి నీవు తండ్రివి. మా అందరికి తండ్రివి, తల్లివి, దైవానివి, భర్తవు, మిత్రుడవు, గురుడవు, సమస్తము నీవే, కన్నతండ్రులు, తండ్రులు ఐదుగురు {తండ్రులు - అయిదుగురు తన్ను గన్నవాడు, ఉపనయనము జేసినవాడు, చదువు చెప్పిన వాడు, విపత్తున కాపాడినవాడు, అన్నము పెట్టి పోషించినవాడు} తో సహా ఎవరు కూడ నీలాగా ప్రజలను పరమానంద భరితులను చేసి ధన్యులను చేయలేరు. దేవతలైనా సరే మా లాగా నీ ముఖ పద్మాన్ని వీక్షించి కృతార్థులు కాలేరు. శ్రీకృష్ణపరమాత్మా!
ద్వారకాపురవాసులు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుని ఇలా స్తుతిస్తున్నారు.
1-253-u.
taMDrula kella@M daMDriyagu dhaataku@M daMDrivi daeva! neevu maa
taMDrivi@M dalliviM bativi daivamavun sakhivin guruMDa; vae
taMDrulu nee kriyaM brajala dhanyula@M jaesiri, vaelpu laina nO
taMDri bhavanmukhaaMbujamu dhanyata@M gaanaru maa vidhaMbunan.
          తండ్రుల = తండ్రుల; కున్ = కు; ఎల్లన్ = అందరికి; తండ్రి = తండ్రి; అగు = అయిన; ధాత = బ్రహ్మ {ధాత - ధరించు వాడు, బ్రహ్మ}; కున్ = కి; తండ్రివి = తండ్రివి; దేవ = కృష్ణా; నీవు = నీవు; మా = మాయొక్క; తండ్రివిన్ = తండ్రివి; తల్లివిన్ = తల్లివి; పతివి = భర్తవి; దైవమవున్ = దేవుడవు; సఖివిన్ = స్నేహితుడవు; గురుండవు = గురువువి; = ఏ ఒక్క; తండ్రులు = తండ్రులు {తండ్రులు - అయిదుగురు తన్ను గన్నవాడు, ఉపనయనము జేసినవాడు, చదువు చెప్పిన వాడు, విపత్తున కాపాడినవాడు, అన్నము పెట్టి పోషించినవాడు}; నీ = నీ; క్రియన్ = వలె; ప్రజల = లోకులను; ధన్యులన్ = ధన్యులనుగా; చేసిరి = చేసిరి; వేల్పులు = దేవతలు; ఐనన్ = అయినప్పటికిని; = ; తండ్రి = తండ్రి; భవన్ = నీ యొక్క; ముఖ = ముఖము అనే; అంబుజము = పద్మము; ధన్యతన్ = ధన్యతతో; కానరు = చూడలేరు; మా = మా; విధంబునన్ = వలె.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: