Monday, August 18, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 385

కొడుకులులేరని

10.1-318-క.
కొడుకులు లేరని యొక సతి
డు వగవఁగఁ దన్ను మగనిఁగాఁ గైకొనినం
గొడుకులు గలిగెద రని పైఁ
డినాఁ డిది వినుము శిశువు నులే? తల్లీ!
                        ఓ యమ్మా యశోదా! ఈ విచిత్రం విను. ఓ యిల్లాలు తనకు కొడుకులు లేరే పుత్రస్య గతిర్నాస్తిః అని శాస్త్రం కదా మరి మా గతేంటి అని బాధపడుతుంటే, నన్ను మొగుడుగా చేసుకో కొడుకులు పుడతారు అని మీదమీదకి వచ్చాడుట మీ వాడు. ఇవేమైనా పసివాడి పనులా చెప్పు.
అవును అతనేమైనా పసివాడా కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే కదా. పరబ్రహ్మస్వరూపు డైన తన్ను భర్తగా స్వీకరించ మని సద్గతులు కలుగుతాయి అని నొక్కి చెప్పే, ఆ కపట శైశవ కృష్ణమూర్తి దొంగజాడల జేయు బాల్యచేష్టలను గోపికలు ఓపికలు లేక యశోదాదేవికి చెప్పుకుంటున్నారు.
10.1-318-ka.
koDukulu laerani yoka sati
kaDu vagava@Mga@M dannu magani@Mgaa@M gaikoninaM
goDukulu galigeda rani pai@M
baDinaa@M Didi vinumu SiSuvu panulae? tallee!
          కొడుకులు = పుత్రులు; లేరు = కలుగలేదు; అని = అనుచు; ఒక = ఒకానొక; సతి = ఇల్లాలు; కడున్ = మిక్కలి; వగవన్ = విచారించగా; తన్నున్ = అతనిని; మగనిన్ = భర్త; కాన్ = అగునట్లు; కైకొనిన్ = చేపట్టినచో; కొడుకులు = పుత్రులు; కలిగెదరు = పుట్టెదరు; అని = అని; పైన్ = మీద; పడినాడు = పడ్డాడు; వినుము = విను; శిశువు = పిల్లవాళ్ళ; పనులే = చేతలాఇవి, కాదు; తల్లీ = అమ్మా.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: