మన్నేటికిభక్షించెదు
10.1-336-క.
మ న్నేటికి భక్షించెదు?
మన్నియమము లేల నీవు మన్నింపవు? నీ
యన్నయు సఖులును జెప్పెద
రన్నా! మ న్నేల మఱి పదార్థము లేదే?
ఏమయ్యా కన్నయ్యా! మట్టెందుకు తింటున్నావు. నే వద్దని చెప్పేవేవి ఎందుకు లెక్క చేయవు. తల అలా
అడ్డంగా ఊపకు. అన్న బలరాముడు, స్నేహితులు అందరు చెప్తున్నారు కదా. ఏం ఇంట్లో తినడానికి
ఇంకేం లేవా పాపం.
అంటు ఆ అమాయకపు తల్లి ఆ నెరదంట పాపడిని
చెయ్యి పట్టుకొని గదమాయిస్తోంది.
10.1-336-ka.
ma
nnaeTiki bhakshiMchedu?
manniyamamu
laela neevu manniMpavu? nee
yannayu
sakhulunu jeppeda
rannaa!
ma nnaela maRi padaarthamu laedae?
మన్ను = మట్టిని; ఏటికిన్ = ఎందుకు; భక్షించెదు = తినెదవు; మత్ = నా యొక్క; నియమములు = ఆంక్షలు, ఆజ్ఞలు; ఏలన్ = ఎందులకు; నీవున్ = నీవు; మన్నింపవు = అనుసరించవు; నీ = నీ యొక్క; అన్నయున్ = అన్నయ్య; సఖులునున్ = స్నేహితలు; చెప్పెదరు = చెప్పుతున్నారు; అన్నా = నాయనా; మన్ను = మట్టి; ఏలన్ = ఎందుకు; మఱి = ఇంకేమి; పదార్థము = తిన దగిన
వస్తువు; లేదే = లేదా ఏమి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment