ఖగనాథుం
10.1-1682-మ.
ఖగనాథుం డమరేంద్రు గెల్చి సుధ మున్ గైకొన్న చందంబునన్
జగతీనాథులఁ జైద్యపక్షచరులన్ సాళ్వాదులన్ గెల్చి భ
ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా
భగవత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్.
పక్షిరాజైన గరుత్మంతుడు
పూర్వం స్వర్గానికి వెళ్ళి దేవేంద్రుడిని జయించి అమృతాన్ని ఆత్మీయం చేసుకొన్నాడు
కదా. అలాగే మంగళకరుడు, చక్రాయుధుడు నైన శ్రీకృష్ణుడు ఛేదిదేశాధిపతియైన
శిశుపాలుణ్ణి, అతని పక్షం వహించిన సాళ్వుడు మొదలైన నరపతులను ఓడించి భీష్మకమహారాజు
పుత్రిక యైన రుక్మిణీదేవిని పెండ్లాడినాడు. ఆ పద్మంవంటి పరిమళం గల భీష్మకసుత
సామాన్యురాలేం కాదు లక్ష్మీదేవి అంశతో జన్మించినామె. గొప్ప గుణవంతురాలు. కన్నెలలో
మిన్న.
రేవతీ దేవి బలరాముల వివాహమైన పిమ్మట
జరిగిన అద్బుతమైన రుక్మిణీ కల్యాణ వృత్తాంతం ఆశ్వాదించి తరించండి అని, ఈ
అమృతగుళికలో సంగ్రహంగా అమర్చేసి ముందుమాట చేసేసారు మన పోతన్నగారు
10.1-1682-ma.
khaganaathuM
DamaraeMdru gelchi sudha mun gaikonna chaMdaMbunan
jagateenaathula@M
jaidyapakshacharulan saaLvaadulan gelchi bha
dragu@MDai
chakri variMche bheeshmakasutan raajeevagaMdhin ramaa
bhagavatyaMSabhavan
mahaaguNamaNin baalaamaNin rukmiNin.
ఖగనాథుండు = గరుత్మంతుడు {ఖగనాథుడు - పక్షుల ప్రభువు, గరుత్మంతుడు}; అమరేంద్రున్ = దేవేంద్రుని; గెల్చి = జయించి; సుధ = అమృతమును; మున్ = పూర్వము; కైకొన్న = తీసుకొన్న; చందంబునన్ = విధముగా; జగతీనాథులన్ = రాజులను; చైద్య = శిశుపాలుని {చైద్యుడు - చేది దేశ ప్రభువు, శిశుపాలుడు}; పక్ష = పక్షమునందు; చరులన్ = వర్తించువారిని; సాళ్వ = సాళ్వుడు{సాళ్వుడు - సాళ్వ దేశ ప్రభువు}; ఆదులన్ = మొదలగువారిని; గెల్చి = జయించి; భద్రగుడు = శుభమును పొందువాడు; ఐ = అయ్యి; చక్రి = కృష్ణుడు {చక్రి - చక్రాయుధము కలవాడు, కృష్ణుడు,
విష్ణువు}; వరించెన్ = వివాహమాడెను; భీష్మక = భీష్మకుని యొక్క; సుతన్ = కుమార్తెను; రాజీవ = పద్మముల వంటి; గంధిన్ = సువాసన కలామెను; రమా = లక్ష్మీ; భగవతి = దేవి యొక్క {భగవతి
- షడ్గుణములచే (1మహత్వ 2ధైర్య 3కీర్తి 4శ్రీ 5ఙ్ఞాన 6వైరాగ్యములుచే) ఐశ్వర్యురాలు, దేవి}; అంశ = అంశతో; భవన్ = పుట్టి నామెను; మహా = గొప్ప; గుణ = సుగుణము లనెడి {సుగుణములు - శమము దమము ఉపరతి తితిక్ష
శ్రద్ధ సమాధానము ఆది గొప్ప మంచి గుణములు}; మణిన్ = రత్నములు కలామెను; బాలా = కన్యక లందు; మణిన్ = శ్రేష్ఠురాలను; రుక్మిణిన్ = రుక్మిణిని.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
1 comment:
Thank you, for this great service. I read one poem a day either first thing in the morning or at the end of the day. I stay with the padyam for more than a hour to savour its meaning, music and metaphor.
🙏🏽
Parakala Prabhakar
Post a Comment