పరుజూచున్
10.2-178-మ.
పరుఁ జూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్, రోషరాగోదయా
విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగం; గన్నులఁ
గెంపు సొంపుఁ బరఁగం జండాస్త్రసందోహమున్
సరసాలోక సమూహమున్ నెఱపుచుం, జంద్రాస్య హేలాగతిన్.
చంద్రునివంటి మోముగల ఆ సత్యభామ కోపంతో కనుబొమలు ముడిచి,
వీరత్వం మూర్తీభవించనట్లు కను లెర్రజేసి, పదునైన బాణాలను ప్రయోగిస్తూ, శత్రువైన
నరకాసురుణ్ణి నొప్పిస్తున్నది. అదే సమయంలో అనురాగంతో మందహాసం చేస్తూ, శృంగారం
ఆకారం దాల్చినట్లు సొంపైన కన్నులతో, సరసపు చూపులు ప్రసరిస్తూ, ప్రియుడైన
శ్రీకష్ణుని మెప్పిస్తున్నది.
నరకాసురవధ సందర్భంగా
సత్యభామ వర్ణన యిది. ఇక్కడ అదే సమయంలో అని స్పురింపజేసిన క్రమాలంకారం పద్యానికి
వన్నెతెచ్చింది.
10.2-178-ma.
paru@M
joochun varu@M joochu noMpa nalariMpan, rOsharaagOdayaa
viratabhrookuTi
maMdahaasamulatO veeraMbu SRMgaaramun
jaragaM; gannula@M geMpu soMpu@M bara@MgaM jaMDaastrasaMdOhamun
sarasaalOka
samoohamun neRapuchuM, jaMdraasya haelaagatin.
పరున్ = శత్రువును; చూచున్ = యత్నించును; వరున్ = పెనిమిటిని; చూచున్ = యత్నించును; ఒంపన్ = నొప్పింపవలెనని; అలరింపన్ = సంతోషపెట్టవలెనని; రోష = కోపము
యొక్క;
రాగ = అనురాము
యొక్క;
ఉదయ = పుట్టుకలచేత; అవిరత = అవిశ్రాంతమైన; భృకుటు = బొమముడితోను; మందహాసముల = చిరునవ్వుల; తోన్ = తోటి; వీరంబున్ = వీర
రసము;
శృంగారమున్ = శృంగార
రసము;
జరగన్ = వర్తించగా; కన్నులన్ = కళ్ళు యందు; కెంపు = ఎర్రదనము; సొంపు = మనోజ్ఞత; పరగన్ = వ్యాపించగా; చండ = తీక్షణమైన, చురుకైన; అస్త్ర = అస్త్రముల {అస్త్రము - మంత్రములచేత యంత్రములచేత ప్రయోగింప బడెడి ఆయుధములు, శస్త్రములు - సామాన్యమైన ఆయుధములు (కత్తి, గద, బాణము మొ.)}; సందోహమున్ = సమూహము; సరస = రసవంతములైన; ఆలోక = చూపుల; సమూహమున్ = సమూహము; నెఱపుచున్ = ప్రసరించుచు; చంద్రాస్య = ఇందువదన {చంద్రాస్య - చంద్రుని వంటి మోము కలామె, స్త్రీ}; హేలా = విలాసమయమైన; గతిన్ = విధముగా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment