కౌరవపాండవులిరువురు
3-21-క.
కౌరవ పాండవు లిరువురు
వే రీతి నైన బాండుకు
మారుల పాలొసఁగి తేని మను నుభయంబున్.
మహారాజ
నువ్వు కన్న కౌరవులు, నీ తమ్ముడు కన్న పాండవులు ఇద్దరూ నీకు ఒక్కటే. నీవు ఎలాగైనా
సరే పాండవుల వాటాకు రావలసిన రాజ్యభాగం ఇచ్చినట్లైతే ఉభయులు క్షేమంగా ఉంటారు.
అంటు
శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో కృష్ణుడు ధృతరాష్ట్రునికి ధర్మోపదేశం చేశాడు.
3-21-ka.
kaurava
paaMDava liruvuru
naaraya
nee kokka samama yavaneevara! nee
vae
reeti naina baaMDuku
maarula
paalosa@Mgi taeni manu nubhayaMbun.
కౌరవ = కౌరవులు నూర్గురు (http://telugubhagavatam.org/products_ running.php?psid=124&catid=8&scatid=34&ccatid=); పాండవులు = పాండవులు ఐదుగురు {పాండవులు - పంచపాండవులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు}; ఇరువురున్ = ఇద్దరును; అరయన్ = చూడగా; నీకున్ = నీకు; ఒక్కసమమ = సమానమే; అవనీవర = రాజ {అవనీవర - భూమికి వరుడు, రాజు}; నీవు = నీవు; ఏరీతిన్ = ఏవిధముగనైన; పాండుకుమారుల = పాండవుల; పాలు = వంతు, భాగము; ఒసంగితేని = ఇచ్చినచో; మనున్ = బ్రతుకుదురు; ఉభయంబున్ = ఇద్దరును.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment