చొక్కపురక్కసి
7-254-క.
చొక్కపు రక్కసి కులమున
వెక్కురు జన్మించినాఁడు విష్ణుని యందున్
నిక్కపు మక్కువ విడువం
డెక్కడి సుతుఁ గంటి రాక్షసేశ్వర! వెఱ్ఱిన్.

ప్రహ్లాదుని గురించి తండ్రి
హిరణ్యకశిపునితో గురువు శుక్రాచార్యుని సుతుడు చండామార్కులు చెప్తున్నారు.
7-254-ka.
chokkapu
rakkasi kulamuna
vekkuru
janmiMchinaa@MDu vishNuni yaMdun
nikkapu
makkuva viDuvaM
DekkaDi
sutu@M gaMTi raakshasaeSvara! veRRin.
చొక్కపు = స్వచ్ఛ మైన; రక్కసి = రాక్షస; కులమున = వంశమున; వెక్కురు = వెఱ్ఱివాడు; జన్మించినాడు = పుట్టినాడు; విష్ణుని = హరి; అందున్ = ఎడల; నిక్కపు = సత్యమైన; మక్కువ = ప్రీతి; విడువండు = వదలుడు; ఎక్కడి = ఎలాంటి; సుతున్ = పుత్రుని; కంటి = పుట్టింటితివి; రాక్షసేశ్వరా = రాక్షసరాజా; వెఱ్ఱిన్ = వెర్రివాడిని.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment