Thursday, August 14, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 381

ఈరీతిశ్రీకృష్ణు

11-7-సీ.
రీతి శ్రీకృష్ణుఁ డేపారఁ బూతనా
 కట తృణావర్త సాల్వ వత్స
చాణూర ముష్టిక ధేను ప్రలంబక
 దైత్యాఘ శిశుపాల దంతవక్త్ర
కంస పౌండ్రాదిక ఖండనం బొనరించి
 టమీఁదఁ గురుబలం ణఁచి మఱియు
ర్మజు నభిషిక్తుఁ నరఁగాఁ జేసిన
 తఁడు భూపాలనం మరఁ జేసె
తే.
క్తులగు యాదవేంద్రులఁ రఁగఁ జూచి
న్యపరిభవ మెఱుఁగ రీ దువు లనుచు
వీరిఁ బరిమార్ప నేఁ దక్క వేఱొకండు
దైవ మిఁక లేదు త్రిభువనాంరమునందు.
          పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసురుడు, ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు మున్నగు రాక్షసులను; చాణూరుడు, ముష్టికుడు, కంసుడు, సాల్వుడు, పౌండ్రకుడు, దంతవక్తృడు మున్నగు దుర్మార్గులను సంహరించాడు. అటుపిమ్మట కురుబలాన్ని అణచివేసి, ధర్మరాజును చక్రవర్తిగా అభిషిక్తుని చేసాడు. ఆ ధర్మరాజు భూపరిపాలన చక్కగా చేస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన భక్తులగు యాదవవీరులను చూసి వీరిని సంహరించడానికి నేను తప్ప వేరొక దైవం ముల్లోకాలలోను లేడు అని భావించాడు.
11-7-see.
ee reeti SreekRshNu@M Daepaara@M bootanaa
 SakaTa tRNaavarta saalva vatsa
chaaNoora mushTika dhaenu pralaMbaka
 daityaagha SiSupaala daMtavaktra
kaMsa pauMDraadika khaMDanaM bonariMchi
 yaTamee@Mda@M gurubalaM baNa@Mchi maRiyu
dharmaju nabhishiktu@M danara@Mgaa@M jaesina
 nata@MDu bhoopaalanaM bamara@M jaese
tae.
bhaktulagu yaadavaeMdrula@M bara@Mga@M joochi
yanyaparibhava meRu@Mga ree yaduvu lanuchu
veeri@M barimaarpa nae@M dakka vaeRokaMDu
deva mi@Mka laedu tribhuvanaaMtaramunaMdu.
          ఈ = ; రీతిన్ = విధముగ; శ్రీ = గొప్పవాడైన; కృష్ణుడు = కృష్ణుడు; ఏపారన్ = అతిశయించి; పూతనా = పూతన; శకట = శకటాసురుడు; తృణావర్త = తృణాసురుడు; సాల్వ = సాల్వాధిపుడు; వత్స = వత్సాసురుడు; చాణూర = చాణూరుడు (మల్లుడు); ముష్టిక = ముష్టికుడు (మల్లుడు); ధేను = ధేనుకాసురుడు; ప్రలంబకదైత్య = ప్రలంబాసురుడు; అఘ = అఘాసురుడు; శిశుపాల = శిశుపాలుడు; దంతవక్త్ర = దంతవక్త్రుడు; కంస = కంసుడు; పౌండ్రక = పౌండ్రకవాసుదేవుడు; ఆదికన్ = మున్నగువారిని; ఖండనంబు = సంహారము; ఒనరించి = చేసి; అటమీద = ఆ తరువాత; కురు = కౌరవుల యొక్క; బలంబున్ = సైన్యాలను; అణచి = అణచివేసి; మఱియున్ = మరియు; ధర్మజున్ = ధర్మరాజును; అభిషిక్తున్ = చక్రవర్తిగా అభిషేకము; తనరగన్ = చక్కగా; చేసినన్ = చేయగా; అతడు = అతను; భూ = రాజ్యము; పాలనంబున్ = పరిపాలించుట; అమరన్ = చక్కగా; చేసె = చేసెను; భక్తులు = తన భక్తులు; అగు = ఐన; యాదవ = యాదవులలో; ఇంద్రులన్ = ఉత్తములను; పరగన్ = ప్రసిద్ధు లగుట; చూచి = చూసి; అన్య = ఇతరులచే; పరిభవమున్ = ఓటమిని; ఎఱుగరు = పొందరు; = ఈ ప్రసిద్ధులైన; యాదవులు = యాదవులు; అనుచు = అని; వీరిన్ = వీరిని; పరిమార్చన్ = సంహరించుటకు; నేన్ = నేనే; తక్క = తప్పించి; వేఱొకండు = మరొక; దైవము = దేవుడు; ఇక = ఇక ఎవరును; లేదు = లేడు; త్రిభువన = ముల్లోకముల; అంతరము నందు = లోను.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: