Tuesday, August 12, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 379

ఒక్కడుమున్నేమఱి

10.1-457-క.
క్కఁడు ము న్నేమఱి చన
నొక్కఁడు బలుబొబ్బ వెట్టు నులికిపడన్; వే
ఱొక్కఁడు మిట్టి తటాలున
నొక్కని కనుదోయి మూయు నొక్కఁడు నగఁగన్.
          పరధ్యానంగా ఒక గోపకుమారుడు ముందు నడుస్తుంటే గమనించినవాడు, అత నులిక్కిపడేలా పెనుబొబ్బ పెట్టాడు. ఒక గోపడు మరొకని కళ్ళు వెనకనించి తటాలున మూసాడు. అది చూసి ఇంకొకడు పకపక నవ్వుతున్నాడు.
అలతిపొలతి పదాలతో కళ్ళకు కట్టినట్టు చెప్పటంలో చెప్పుకొదగ్గ పోతన, తన భాగవతంలో అద్భుతంగా ఆవిష్కరించిన చల్దులు గుడుచుట ఘట్టంలో ప్రసిద్దమైన పద్య మిది.
10.1-457-ka.
okka@MDu mu nnaemaRi chana
nokka@MDu balubobba veTTu nulikipaDan; vae
Rokka@MDu miTTi taTaaluna
nokkani kanudOyi mooyu nokka@MDu naga@Mgan.
          ఒక్కడు = ఒకానొకడు; మున్ను = ముందుకి; ఏమఱి = పరాకుపడి; చనన్ = పోగా; ఒక్కడున్ = ఒకానొకడు; పలు = పెద్ద; బొబ్బన్ = కేకలు; పెట్టున్ = వేయును; ఉలికిపడన్ = ఉలికిపడు నట్లుగా; వేఱొక్కడు = మరింకొకడు; మిట్టి = అతిశయించి; తటాలున = చటుక్కున; ఒక్కని = ఒకానొకని; కను = కళ్ళు; దోయి = రెంటిని (2); మూయున్ = చేతులతో కప్పివేయును; ఒక్కడున్ = ఒకానొకడు; నగగన్ = నవ్వుతుండగా.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: