Tuesday, August 5, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 372

ఆడంజని

10.1-311-క.
డం జని వీరల పెరు
గోక నీ సుతుఁడు ద్రావి యొక యించుక తాఁ
గోలి మూఁతిం జరిమినఁ
గోలు మ్రు చ్చనుచు నత్త గొట్టె లతాంగీ!
          లతలవలె సున్నితమైన దేహం గల సుందంరాంగీ యశోదా! నీ కొడుకు అలా వెళ్ళి, వీళ్ళ ఇంట్లోని పెరుగు శుభ్రంగా తాగాడు. పోతూపోతూ నిద్రపోతున్న వాళ్ళ కోడలి మూతికి కొద్దిగా పెరుగు పులుమాడు. లేచాక అత్తగారు చూసి దొంగతిండి తిందని కోడలిని కొట్టింది.
ఆ కపట శైశవ కృష్ణమూర్తి దొంగజాడల జేయు బాల్యచేష్టలను గోపికలు ఓపికలు లేక యశోదాదేవికి చెప్పుకుంటున్నారు.
10.1-311-ka.
aaDaM jani veerala peru
gODaka nee sutu@MDu draavi yoka yiMchuka taa@M
gODali moo@MtiM jarimina@M
gOdalu mru chchanuchu naththa gotte lathaangii!
          ఆడన్ = అక్కడకు; చని = వెళ్ళి; వీరల = వీరి యొక్క; పెరుగున్ = పెరుగును; ఓడకన్ = బెదురు లేకుండ; నీ = నీ యొక్క; సుతుండు = పుత్రుడు; త్రావి = తాగి; యొక యించుక = కొంచము; తాన్ = అతను; కోడలి = వారి కొడుకు భార్య యొక్క; మూతిన్ = నోటికి; చరిమినన్ = రాయగా; కోడలు = కోడలు; మ్రుచ్చు = దొంగ; అనుచును = అనుచు; కొట్టెన్ = కొట్టినది; లతాంగీ = ఇంతి {లతాంగి - లతవంటి దేహము కలామె, స్త్రీ}.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: