Saturday, August 2, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 370

వారిజాక్షులందు

8-585-.
వారిజాక్షులందు వైవాహికము లందుఁ
బ్రా విత్త మాన భంగమందుఁ
కిత గోకు లాగ్రన్మ రక్షణ మందు
బొంకవచ్చు నఘము పొందఁ దధిప!
          ఓ బలిచక్రవర్తి! ఆడవారి విషయంలో కాని, పెళ్ళిళ్లకు కాని, ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భగంకలిగే టప్పుడు కాని భీతిల్లిన గోవులను, విప్రులను కాపాడే టప్పుడు కాని అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు. దాని వల్ల పాపం రాదు.
బలిచక్రవర్తికి రాక్షస గురువు శుక్రుడు నీతి బోధిస్తున్నాడు. ఇతగాడు సామాన్యుడు కాదు. వామన రూపంలో ఉన్న విష్ణువు. మూడడుగులతో ముజ్జగాలు ఆక్రమించేస్తాడు ని గ్రహించి. నీ ప్రాణాలు, సంపదలు, మానం సమస్తం అపహరించేస్తాడు. ఇలాం టప్పుడు అబద్దం చెప్పినా పాపం రాదు. అందుచేత నిర్భయంగా వామనుని కోరిక తిరస్కరించు అని చెప్తున్నాడు.
8-585-aa.
vaarijaakshulaMdu vaivaahikamu laMdu@M
braaNa vitta maana bhaMgamaMdu@M
jakita gOku laagrajanma rakshaNa maMdu
boMkavachchu naghamu poMda@M dadhipa!
వారిజాక్షుల = ఆడవారి విషయము {వారిజాక్షులు - వారిజ (పద్మముల)వంటి అక్షులు (కన్నులు కలవారు), స్త్రీలు}; అందున్ = లోను; వైవాహికములు = పెండ్లికి సంబంధించిన వాని; అందున్ = లోను; ప్రాణ = ప్రాణములు; విత్త = ధనములు; మాన = గౌరవము; భంగము = పోయెడి సందర్భముల; అందున్ = లోను; చకిత = భీతిల్లిన; గో = గోవుల; కుల = సమూహములను; అగ్రజన్మ = బ్రాహ్మణులను; రక్షణము = కాపాడుట; అందున్ = లోను; బొంకవచ్చు = అబద్ద మాడవచ్చును; అఘము = పాపము; పొందదు = అంటదు; అధిప = రాజా.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: