అన్నములేదు
9-647-ఉ.
అన్నము లేదు కొన్ని మధురాంబువు లున్నవి; త్రావు
మన్న! రా
వన్న! శరీరధారులకు నాపద వచ్చిన వారి యాపదల్
గ్రన్నన మాన్చి వారికి సుఖంబులు చేయుటకన్న నొండు మే
లున్నదె? నాకు
దిక్కు పురుషోత్తముఁ డొక్కఁడ చుమ్ము పుల్కసా!
రంతి దేవుని వద్ద కొన్ని
మంచినీళ్ళు తప్పించి ఏమి లేవు. తను తన కుటుంబం భీకరమైన ఆకలి దాహాలతో నిరాహారంగా
ఉండి కూడ ఛండాలుడు వచ్చి వేడుకుంటే, ఉన్న కాసిని నీళ్ళు అతనికి ఆప్యాయంగా
పోసేస్తున్నాడు.
9-647-u.
annamu
laedu konni madhuraaMbuvu lunnavi; traavu manna! raa
vanna!
Sareeradhaarulaku naapada vachchina vaari yaapadal
grannana
maanchi vaariki sukhaMbulu chaeyuTakanna noMDu mae
lunnade?
naaku dikku purushOttamu@M Dokka@MDa chummu pulkasaa!
అన్నము = అన్నము; లేదు = లేదు; కొన్ని = కొద్దిగా; మధురాంబువులున్ = మంచినీళ్ళు; ఉన్నవి = ఉన్నాయి; త్రావుము = తాగుము; అన్న = నాయనా; రావు = రా; అన్న = నాయనా; శరీరధారుల్ = జీవుల; కున్ = కు; ఆపద = కష్టము; వచ్చినన్ = కలిగినచో; వారి = వారి యొక్క; ఆపదల్ = కష్టములను; క్రన్ననన్ = వెంటనే; మాన్చి = పోగొట్టి; వారి = వారల; కిన్ = కు; సుఖంబులు = సౌఖ్యములు; చేయుట = చేయుట; కన్నన్ = కంటెను; ఒండు = మరియొక; మేలు = ఉత్తమమైనది; ఉన్నదె = ఉన్నదా, లేదు; నా = నా; కున్ = కు; దిక్కు = అండ; పురుషోత్తముడు = విష్ణువు; ఒక్కడ = మాత్రమే; చుమ్ము = సుమా; పుల్కసా = చండాలుడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment