వెడవెడనడకలు
8-541-క.
వెడవెడ నడకలు నడచుచు
నెడనెడ నడు గిడక నడరి యిల దిగఁబడగా
బుడిబుడి నొడువులు నొడువుచుఁ
జిడిముడి తడఁబడగ వడుగు చేరెన్ రాజున్.
వామనుడు మెల్లమెల్లగా
అడుగులువేస్తూ నడిచాడు. అక్కడక్కడ నేల దిగబడుతుంటే అడుగులు తడబడుతు నడిచాడు.
మధ్యలో కొద్దికొద్దిగా మాట్లాడుతు, తడబడుతు, కలవరబడుతు బలిచక్రవర్తిని సమీపించాడు.
బలిచక్రవర్తి యాగశాలలోనికి
వామనరూపంతో మయావటువుగా అవతరించిన విష్ణువు ప్రవేశించే ఘట్టం. పద్యం నడక వామనుని
నడకతో పోటీపడుతోందా అన్నట్టు ఉంది.
8-541-ka.
veDaveDa
naDakalu naDachuchu
neDaneDa
naDu giDaka naDari yila diga@MbaDagaa
buDibuDi
noDuvulu noDuvuchu@M
jiDimuDi
taDa@MbaDaga vaDugu chaeren raajun.
వెడవెడన్ = మెల్లిమెల్లి; నడకలు = అడుగులుతో; నడచుచున్ = తిరుగుతు; ఎడనెడ = మధ్యమధ్యలో; అడుగు = అడుగులు; ఇడక = వేయకుండ; అడరి = బెదరి; ఇల = భూమి; దిగబడగా = కుంగిపోతుండగ; బుడిబుడి = చిన్నచిన్న; నొడువులున్ = మాటలు; నొడువుచున్ = పలుకుచు; చిడిముడిన్ = కలవరపాటుతో; తడబడగ = తడబడుతుండగ; వడుగు = బ్రహ్మచారి; చేరెన్ = సమీపించెను; రాజున్ = చక్రవర్తిని.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment