Tuesday, August 19, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 386

శ్రీతరుణీ హృదయస్థిత

5.2-166-క.
శ్రీ రుణీ హృదయస్థిత!
పాకహర! సర్వలోకపావన! భువనా
తీగుణాశ్రయ! యతి వి
ఖ్యా! సురార్చిత పదాబ్జ! కంసవిదారీ!
          శ్రీదేవి ఐన లక్ష్మీదేవి హృదయంలో నివసించెడివాడా! జీవుల పాపాలు సర్వం హరించెడి వాడా! సమస్తమైన లోకాలను పవిత్రం జేసెడివాడా! అలొకిక గుణాలకు ఆశ్రయమైనవాడా!ఎనలేని ప్రసిద్ధి గలవాడా! దేవతాశ్రేష్టులందరిచే పూజింపబడెడి పాదపద్మాలు గలవాడా! కంసుణ్ణి సంహరించినవాడా! శ్రీకృష్ణా! నీకు నమస్కారం.
5.2-166-ka.
Sree taruNee hRdayasthita!
paatakahara! sarvalOkapaavana! bhuvanaa
teetaguNaaSraya! yati vi
khyaata! suraarchita padaabja! kaMsavidaaree!
          శ్రీతరుణీహృదయస్థిత = శ్రీకృష్ణా {శ్రీతరుణీ హృదయ స్థితుడు - శ్రీతరుణీ (లక్ష్మీదేవి) హృదయమందు స్థితుడు (నివసించెడివాడు), కృష్ణుడు}; పాతక హర = శ్రీకృష్ణా {పాతక హరుడు - పాతక (పాపములను) హరుడు (హరించువాడు), కృష్ణుడు}; సర్వ లోక పావన = శ్రీకృష్ణా {సర్వ లోక పావనుడు - సర్వ (అఖిల మైన) లోకములను పావనుడు (పవిత్రము జేయువాడు), కృష్ణుడు}; భువ నాతీత గుణాశ్రయ = శ్రీకృష్ణా {భువ నాతీత గుణాశ్రయుడు - భువన (లోకములు అన్నిటికిని) అతీత మైన గుణములకు ఆశ్రయుడు (నిలయ మైనవాడు), కృష్ణుడు}; అతి విఖ్యాత సురార్చిత పదాబ్జ = శ్రీకృష్ణా {అతి విఖ్యాత సురార్చిత పదాబ్జ - అతి (మిక్కిలి) విఖ్యాత (ప్రసిద్దిచెందిన) సురా (దేవతలచే) అర్చిత (పూజింపబడెడి) పద (పాదములు యనెడి) అబ్జుడు (పద్మములు గలవాడు), కృష్ణుడు}; కంస విదారీ = శ్రీకృష్ణా {కంస విదారి - కంసుని విదారి (సంహరించివాడు), కృష్ణుడు};

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: