Wednesday, April 30, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 274

తొఱ్ఱులగాచిన 

10.1-634-క.
తొఱ్ఱులఁ గాచిన నందుని
కుఱ్ఱని చరితామృతంబు గొనకొని చెవులన్
జుఱ్ఱంగఁ దనివి గల్గునె;
వెఱ్ఱుల కైనను దలంప? విప్రవరేణ్యా!
          ఓ శుకబ్రహ్మ! గోవులను కాచిన నందుని కుమారుని కథలనే సుధారసాన్ని చెవులారా జుర్రుకుంటు ఆస్వాదిస్తున్న ఎంతటి వెర్రివాడైనా తృప్తిచెంది ఇంకచాలు అనుకోగలడా, ఊహు అనుకోలేడు.
కాళియమర్థన ఘట్టం ఆరంభిస్తున్న అవధూతోత్తముడు శుకునితో పరమ భాగవతుడు పరీక్షిత్తు పలికిన పలుకు లివి.
10.1-634-ka.
toRRula@M gaachina naMduni
kuRRani charitaamRtaMbu gonakoni chevulan
juRRaMga@M danivi galgune;
veRRula kainanu dalaMpa? vipravaraeNyaa!
          తొఱ్ఱులన్ = ఆవులను; కాచిన = మేపెడి; నందుని = నందుని యొక్క; కుఱ్ఱని = కుమారుని; చరిత = చరిత్ర అనెడి; అమృతంబున్ = అమృతమును; కొనకొని = పూని; చెవులన్ = చెవులతో; జుఱ్ఱంగన్ = ఆసక్తితో ఎంత ఆస్వాదించినా; తనివి = తృప్తి; కల్గునె = కలుగునా, కలుగదు; వెఱ్ఱుల్ = పిచ్చివాని; కిన్ = కి; ఐనను = అయినప్పటికి; తలంపన్ = తరచిచూసినచో; విప్ర = బ్రాహ్మణ; వరేణ్యా = శ్రేష్ఠుడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: