Friday, April 4, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 249

శ్రీమహిత

3-1-క.
శ్రీహిత వినుత దివిజ
స్తో! యశస్సీమ! రాజసోమ! సుమేరు
స్థే! వినిర్జితభార్గవ
రా! దశాననవిరామ! ఘుకులరామా
          శ్రీరామా! శ్రీకరమైన మహిమ కలవాడ! దేవతలుచే సంస్తుతింపబడు వాడ! దిగ్దిగంతాల వరకు వ్యాపించే యశస్సు కలవాడ! చంద్రుని వలె చల్లని పరిపాలన చేయువాడ! మేరునగ ధీరుడ! రశురాము డంతటి వాని విచిత్రంగా భంగపరచిన శూరుడ! పదితలల రావణాసురుని తుదముట్టించిన వీరాధివీరుడ! రఘువంశోద్ధారక రామ! అవధరించు.
3-1-ka.
Sreemahita vinuta divija
stOma! yaSasseema! raajasOma! sumaeru
sthaema! vinirjitabhaargava
raama! daSaananaviraama! raghukularaamaa
          శ్రీ = శుభకర మైన; మహిత = మహిమ కలవాడ; వినుత = పొగడబడుతున్న; దివిజ = దేవతల {దివిజులు - స్వర్గమున ఉండువారు, దేవతలు}; స్తోమ = సమూహముకలవాడ; యశః = కీర్తికి; సీమ = హద్దు యైనవాడ; రాజ = రాజులలో; సోమ = చంద్రుడా; సుమేరు = మేరుపర్వతము వలె; స్థేమ = స్థిరమైన స్వభావము కలవాడ; వినిర్జిత = చక్కగా జయింపబడిన; భార్గవరామ = పరశురాముడు కలవాడ {భార్గవ రాముడ - భర్గుని యొక్క రాముడు}; దశానన = రావణుని {దశానన - పది తలలు కలవాడు, రావణుడు}; విరామ = సంహరించిన వాడ; రఘుకులరామ = రఘురామ {రఘు కుల రాముడు - రఘు వంశపు రాముడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: