కలయో వైష్ణవమాయయో
10.1-342-మ.
కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో!
తలఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర
స్థలమో! బాలకుఁ డెంత? యీతని
ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్.
నేను
కలగనటంలేదు కదా! లేకపోతే ఇదంతా విష్ణుమాయ కాదుగదా! దీనిలో మరింకేదైనా
అర్థం ఉందా! కాకపోతే ఇదే సత్యమైనదేమో! నా మనసు సరిగా
ఆలోచించటం లేదేమో! నేను నిజంగా యశోదాదేవినేనా! ఇది అసలు మా
యిల్లేనా! ఇదంతా ఏమిటి ఈ పిల్లాడు చూస్తే ఇంత ఉన్నాడు. ఈ
బ్రహ్మాండ మంతా ఇతని నోట్లో ఎందుకు వెలిగిపోతోందో ఏమిటో! ఆలోచిస్తున్న
కొద్దీ ఎంతో ఆశ్చర్యం కలుగుతోంది.
బాలకృష్ణుని నోట్లో బ్రహ్మాండం కనిపించడంతో యశోదాదేవి
విభ్రాంతురాలై ఇలా అనుకున్నది.
10.1-342-ma.
.kalayO!
vaishNava maayayO! yitara saMkalpaarthamO! satyamO!
tala@Mpan
naeraka yunnadaanano! yaSOdaadaevi@M gaanO! para
sthalamO!
baalaku@MDeMta? yeetani mukhasthaMbai yajaaMDaMbu pra
jvalamai
yuMDuTa kaemi haetuvo! mahaaScharyaMbu chiMtiMpa@Mgan
కలయో = స్వప్నమా; వైష్ణవ = విష్ణుమూర్తి యొక్క; మాయయో = మాయా; ఇతర సంకల్పార్థమో = వేరే విధమైన
సంకల్పంతో చూపబడుతున్న విషయమేమో యిది; సత్యమో = వాస్తవమా; తలపన్ = విచారించ; నేరక = లేక; ఉన్నదాననొ = ఉన్నానేమో; యశోదాదేవిన్ = నేనసలు యశోదాదేవిని; కానో = కాదా; పర = ఇతర మైన; స్థలమో = ప్రదేశమా (ఇది); బాలకుడు = పిల్లవాడు; ఎంత = ఎంతటి వాడు; ఈతని = అతని యొక్క; ముఖస్థంబు = ముఖము నందున్నది; ఐ = అయ్యి; అజాండంబు = విశ్వము; ప్రజ్వలము = మిక్కలి ప్రకాశించునది; ఐ = అయ్యి; ఉండుట = ఉండుట; కున్ = కు; ఏమి = ఏమి; హేతువో = కారణమో; మహా = గొప్ప; ఆశ్చర్యంబు = వింత; చింతింపగన్ = విచారించగా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment