అరయగ
5.2-51-క.
అరయఁగ సీతాలక్ష్మణ
పరివృతుఁడై వచ్చి రామభద్రుఁడు గడిమిం
బరఁగు నధిదేవతగఁ గిం
పురుష మహావర్షమునకు భూపవరేణ్యా!
ఓ పరీక్షిన్మహారాజా! కింపురుష
వర్షానికి సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు అధిదేవత.
సప్తద్వీపములలో
ప్రథమమైనది జంబూద్వీపం. జంబూద్వీపంలో ఉన్న నవవర్షములు (9) లోను ఆరవది (కింపురుష
వర్షం) అధిపతి ఆంజనేయుడు, అధిదేవత శ్రీరాముడు. ఏడవది భరత వర్షం అధిపతి నాభి
అధిదేవత నారాయణుడు. [తెలుగుభాగవతం.ఆర్గ్ >వివరణలు> అనుయుక్తములు>సప్తద్వీపాలు వివరాలు ]
5.2-51-ka.
araya@Mga
seetaalakshmaNa
parivRtu@MDai
vachchi raamabhadru@MDu gaDimiM
bara@Mgu
nadhidaevataga@M giM
purusha
mahaavarshamunaku bhoopavaraeNyaa!
అరయగన్ = చూడగా; సీతా = సీతయు; లక్ష్మణ = లక్ష్మణుడు; పరివృతుండు = చుట్టునున్నవాడు; ఐ = అయ్యి; వచ్చి = చేరి; రామభద్రుడు = శ్రీరాముడు; కడిమిన్ = అతిశయముతో; పరగున్ = ప్రసిద్ధమగు; అధిదేవతగన్ = అధిదేవతగ; కింపురుష = కింపురుషము యనెడి; మహా = గొప్ప; వర్షమున్ = వర్షమున; కున్ = కు; = భుపవరేణ్య = మహారాజా {భూపవరేణ్యుడు - భూప (రాజు)లలో వరేణ్యుడు (ముఖ్యుడు), మహారాజు};
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment