వాయువశంబులై
1-211-ఉ.
వాయువశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం
బాయుచు నుండుకైవడిఁ బ్రపంచము సర్వముఁ గాలతంత్రమై
పాయుచుఁ గూడుచుండు నొకభంగిఁ జరింపదు కాల మన్నియుం
జేయుచుఁ నుండుఁ గాలము విచిత్రము దుస్తర మెట్టివారికిన్.
ఆకాశంలోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం
కలుసుకొంటు విడిపోతు ఉంటాయి. అలానే ఈ ప్రపంచంలోని ప్రాణికోటి సమస్తం కాలం యొక్క
అల్లిక వల్ల కూడుతు, విడిపోతు ఉంటాయి. కాలం ఎప్పడు ఒకేలా జరగదు. జీవికి స్వేచ్చ
అనేది లేదు. కాలమే అన్నిటికీ మూలం. కాలం చాలా విచిత్రమైంది. ఎంతటి వారు అయినా ఈ
కాల ప్రభావాన్ని దాటలేరు.
అని మరిన్ని విదాలుగ అంపశయ్య
మీదున్న భీష్ములవారు ధర్మరాజుకు ఉపదేశాల చేసారు.
1-211-u.
vaayuvaSaMbulai
yegasi vaaridharaMbulu miMTa@M gooDuchuM
baayuchu
nuMDukaivaDi@M brapaMchamu sarvamu@M gaalataMtramai
paayuchu@M
gooDuchuMDu nokabhaMgi@M jariMpadu kaala manniyuM
jaeyuchu@M
nuMDu@M gaalamu vichitramu dustara meTTivaarikin.
వాయు = గాలికి;
వశంబులు = ప్రభావానికి లోనైనవి; ఐ = అయ్యి; ఎగసి = ఎగిరి; వారిధరంబులు = మేఘములు {వారి ధరములు
-నీటిని కలిగియుండునవి, మేఘములు};
మింటన్ = ఆకాశములో; కూడుచున్ = కలుస్తు; పాయుచున్ = విడిపోతు; ఉండు = ఉంటడెడి; కైవడిన్ = విధముగ; ప్రపంచము = లోకము; సర్వమున్ = అంతా; కాల = కాలము చేత; తంత్రము = అల్లబడిన / మాయకు; ఐ = లోబడినవి అయ్యి; పాయుచున్ = దూరమగుచు; కూడుచుండున్ = కలియుచు; ఒక = ఒక; భంగిన్ = విధముగ; చరింపదు = జరుగదు; కాలము = కాలము; అన్నియున్ = అన్నిటిని; చేయుచున్ = చేస్తూ; ఉండున్ = ఉండును; కాలము = కాలము; విచిత్రము = విచిత్రమైనది; దుస్తరము = దాటుటకు వీలుకానిది; ఎట్టివారి = ఎటువంటి వారి; కిన్ = కైనను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
1 comment:
Excellent poem sir...Every politician/ bureaucrat/ judicial officer, for that matter every fellow who is under impression that, everything is at their hand, they can act anyway and none are above them, be taught this poem.
None are above time. Time will decide everything...it keeps the fellows at right place. May be it is jail hospital or grave yard
Post a Comment