హయరింఖాముఖ
1-220-మ.
హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయముం బార్థున కిచ్చువేడ్క నని నాశస్త్రాహతిం జాల నొ
చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంత మున్.
రేగిన గుర్రాల కాలిగిట్టల ధూళితో దుమ్ముకొట్టుకుపోతున్నా,
ముంగురులు చెదిరి పోతున్నా, అధికమైన రథ వేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమట్లు
కారుతున్నా, ముచ్చటైన ముఖమంతా ఎర్రగా అవుతున్నా, నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత
నొప్పెడుతున్నా లెక్క చెయ్యకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో
అతనిని ప్రోత్సహిస్తు యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణపరమాత్మని నా మనస్సులో
ఎడతెగకుండా ధ్యానిస్తుంటాను.
స్వచ్చంద మరణుడు కురువృద్దుడు భీష్ముల వారు అంపశయ్యమీద ఉన్నారు.
తనకు మరణసమయం ఆసన్నమైందని తెలుసు. ధర్మరాజుతో వచ్చిన కృష్ణ ముఖారవిందాన్ని
దర్శిస్తు, కురుక్షేత్రంలో భారతయుద్ధ సన్నివేశంలోని కృష్ణ స్వరూపాన్ని స్మరిస్తున్నారు.
1-220-ma.
hayariMkhaamukha
dhooLi dhoosara parinyastaalakOpaetamai
rayajaataSrama
tOyabiMduyutamai raajillu nemmOmutO
jayamuM
baarthuna kichchuvaeDka nani naaSastraahatiM jaala no
chchiyu@M
bOriMchu mahaanubhaavu madilO@M jiMtiMtu naSraaMta mun.
హయ = గుర్రముల;
రింఖా = కాలి గిట్టల; ముఖ = చివళ్ళ నుండి లేచు; ధూళి = దుమ్ము వలన; ధూసర = బూడిదవర్ణము; పరిన్యస్త = పైపూత గా ఉన్న; అలక = ముంగురులుతో; ఉపేతము = కూడినది; ఐ = అయి; రయ = వేగమువలన; జాత = పుట్టినట్టి; శ్రమ = శ్రమచేత పట్టిన; తోయ = నీటి / చెమట; బిందు = బిందువులతో; యుతము = కూడినది; ఐ = అయ్యి; రాజిల్లు = ఎర్రనైన; నెఱ = నిండు; మోము = ముఖము; తోన్ = తో; జయమున్ = జయమును; పార్థున = అర్జునున; కున్ = కు; ఇచ్చు = ఇవ్వవలె ననే; వేడ్కన్ = కోరికతో; అనిన్ = యుద్ధములో; నా = నా యొక్క; శస్త్ర = శస్త్రముల; ఆహతిన్ = దెబ్బల వలన; చాలన్ = అధికముగ; నొచ్చియున్ = నొప్పి చెందియు; పోరించు = యుద్ధమును చేయించు; మహానుభావున్ = మహానుభావుని; మది = మనసు; లోన్ = లో; చింతింతున్ = స్మరింతును; అశ్రాంతమున్ = ఎల్లప్పుడూ.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment