Sunday, April 6, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 250

పావనములు

1-447-క.
పానములు దురితలతా
లానములు నిత్యమంగ ప్రాభవ సం
జీనములు లక్ష్మీ సం
భానములు వాసుదేవు దసేవనముల్.
          విశ్వమంత ఆత్మగా వసించి ఉండే పరమాత్మ, వసుదేవుని ఇంటిపంట శ్రీకృష్ణుని పాదాల యందలి భక్తి ప్రపత్తులు విశ్వానికి పవిత్రత ప్రసాదించేవి; సమస్త పాపాలనే బంధనాలను కోసేసే కొడవళ్ళు; శాశ్వత శుభ వైభవాలను సమకూర్చే సాధనాలు; సిరిసంపదల సుప్రదానములు.
శౌనకాది మహర్షులు భాగవత మహత్యాన్ని, భాగవతుల తోడి సాంగత్య ప్రభావాలను తెలిసిన మహా జ్ఞానులు. వారు హరిభక్తి విశిష్ఠతలను స్మరిస్తు, సూతునికి భాగవతోత్తము డైన పరీక్షిత్తు కథారూప మైన శ్రీమద్భాగవతాన్ని ఉపన్యసించ మని విన్నవించారు.
1-447-ka.
paavanamulu duritalataa
laavanamulu nityamaMgaLa praabhava saM
jeevanamulu lakshmee saM
bhaavanamulu vaasudaevu padasaevanamul.
          పావనములు = పవిత్రము చేయునవి; దురిత = పాపములు అను; లతా = తీగలను; లావనములు = కోసివేయునవి (కొడవళ్ళు); నిత్య = శాశ్వత మైన; మంగళ = శుభములను ఇచ్చు; ప్రాభవ = వైభవాలను; సంజీవనములు = బ్రతికించునవి; లక్ష్మీ = సంపదలను; సంభావనములు = గౌరవములు ఇచ్చునవి; వాసుదేవు = హరి {వాసుదేవుడు - ఆత్మల వసించు దేవుడు, భగవంతుడు}; పద = పదముల; సేవనముల్ = పూజనములు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: