Wednesday, April 2, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 246

అన్నులచన్నుల

10.1-802-క.

న్నుల చన్నుల దండ వి
న్నులు గా కెల్లవారు బ్రతికిరిగా కీ
న్నుల మీఱిన వలి నా
న్నులు గా కుండఁ దరమె బ్రహ్మాదులకున్.
          ఈ హేమంత ఋతువులో పడతుల పయోధరాల చెంత ప్రజలందరు ఆపదకు లోనుగాకుండ జీవింప గలుగుతున్నారు. వాటి అండే లేకపోతే బ్రహ్మాది దేవతల కైనా చలిబాధ తట్టుకోడం సాధ్యం కాదు కదా.
దశమ స్కంధలో హేమంత ఋతు వర్ణనలో ప్రయోగించిన చమత్కార పద్యమిది. అసలే చలి కాలం, ఆపైన హేమంత ఋతువు మరి చలి చంపేస్తుంటుంది కదా. ఆ చలిబాధ నుంచి రక్షణకి ప్రజలు అందరు తమ స్త్రీల స్తనాలని ఆశ్రయించారుట. లేకపోతే తట్టుకోలేరుట. ఆ బ్రహ్మగారి విషయం అయినా ఇంతే నట. ఋతువర్ణన ఉదయాస్తమయాల వర్ణనాదులు ప్రబంధ లక్షణాలలో ఒక నియమం. ఇలా ప్రబంధ నియమాలను పాటించిన భాగవత పురాణం ఒక నిండు ప్రబంధం రత్నం.
10.1-802-ka.
annula channula daMDa vi
pannulu gaa kellavaaru bratikirigaa kee
channula meeRina vali naa
pannulu gaa kuMDa@M darame brahmaadulakun.
          అన్నుల = స్త్రీల యొక్క {అన్ను - పరవశింప చేయునామె, స్త్రీ}; చన్నుల = పాలిండ్ల; దండన్ = ప్రాపుచేత, అండచేత; విపన్నులు = ఆపదపొందినవారు; కాక = కాకుండగ; ఎల్ల = అందరు; వారున్ = జనులు; బ్రతికిరి = కాపాడబడిరి; కాక = తప్పించి; = ఈ యొక్క; చన్నులన్ = పాలిండ్లను; మీఱినన్ = లెక్కచేయకపోయినచో; వలిన్ = చలిచేత; ఆపన్నులు = ఆపదలుపొందినవారు; కాకుండన్ = కాకుండుట; తరమె = శక్యమా, కాదు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదుల = మొదలగువారల; కున్ = కు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: