Monday, April 7, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 251

ఓ కదళీస్తంభోరువ

3-731-క.

దళీస్తంభోరువ!
యే కు? మే జాడ దాన? వెవ్వరి సుత? వి
ట్లేకాంతంబున నిచ్చట
నే కారణమునఁ జరించె? దెఱిఁగింపు తగన్.
          అరటి కంబాల లాంటి నున్నటి తొడలు గల సుందరీ! నీదే కులం? నీదే ఊరు? నీ తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు నీవు ఇక్కడ వంటరిగా తిరుగుతున్నావు? మాకు తెలిసేలా చెప్పు.
తను సృష్టించిన రాక్షసుల నుండి తప్పించుకోడానికి బ్రహ్మదేవుడు తన దేహాన్ని విడిచాడు. ఆ దేహంనుండి ఆ రాక్షసులను మోహంలో పడేసిన సంధ్యాసుందరి జనించింది. చిట్టిపొట్టి పదాలతో ఎంతటి గంభీర భక్తిభావాలైనా, సరస శృంగారమైనా పండించగల మేటి పోతన గారి ఆ సంధ్యాసుందరి వర్ణన యిది.
3-731-ka.
O kadaLeestaMbhOruva!
yae kula? mae jaaDa daana? vevvari suta? vi
TlaekaaMtaMbuna nichaTa
nae kaaraNamuna@M jariMche? deRi@MgiMpu tagan.
          = ; కదళీ = అరటి; స్తంభ = స్తంభముల వంటి; ఊరువ = తొడలు కలదానా; = ; కులము = వర్ణమునకు; = ; జాడ = ప్రాంతమునకు; దానవున్ = చెందిన దానవు; ఎవ్వారి = ఎవరి యొక్క; సుతవు = పుత్రికవు; ఇట్లు = ఈ విధముగ; ఏకాంతమున = ఒంటరిగ; ఇచటన్ = ఇక్కడ; = ; కారణమునన్ = కారణముచేత; చరించెదవు = తిరుతుంటివి; ఎఱిగింపు = తెలుపుము; తగన్ = అవశ్యము.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: