Thursday, May 1, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 275

భీమంబై

8-112-శా.
భీమంబై తలఁద్రుంచి ప్రాణములఁ బాపెం జక్రమా శుక్రియన్
హేక్ష్మాధర దేహముం జకిత వన్యేభేంద్ర సందోహముం
గా క్రోధన గేహమున్ గరటి రక్తస్రావ గాహంబు ని
స్సీమోత్సాహము వీతదాహము జయశ్రీమోహమున్ గ్రాహమున్.
          రివ్వురివ్వున పోయి, చక్రాయధం మొసలి తలని భయంకరంగా తెగనరికింది. ఆ మకరం మేరు పర్వతమంత పెద్ద దేహం గలది, అడవి ఏనుగులకు సైతం భయం కలిగించేది, కామక్రోధాలతో నిండినది. గజరాజు రక్తధారల రుచిమరిగినది, అంతులేని ఉత్సాహంతో అలసటలేకుండ పోరాడుచున్నది, గెలుపుని నమ్మకంగా కోరుతున్నది. విష్ణుచక్రం వెళ్ళి అలాంటి మొసలి శిరస్సుని ఖండించి ప్రాణాలు తీసింది.
8-112-Saa.
bheemaMbai tala@MdruMchi praaNamula@M baapeM jakramaa Sukriyan
haemakshmaadhara daehamuM jakita vanyaebhaeMdra saMdOhamuM
gaama krOdhana gaehamun garaTi raktasraava gaahaMbu ni
sseemOtsaahamu veetadaahamu jayaSreemOhamun graahamun.
          భీమంబు = భయంకర మైనది; = అయ్యి; తలన్ = శిరస్సును; త్రుంచి = కత్తిరించి; ప్రాణములన్ = ప్రాణములను; పాపెన్ = తీసెను; చక్రమున్ = విష్ణు చక్రము; ఆశు = వేగవంత మైన; క్రియన్ = విధముగ; హేమక్ష్మాధర = మేరుపర్వతము వంటి {హేమక్ష్మాధరము - హేమ (బంగారు) క్ష్మాధరము (కొండ), మేరుపర్వతము}; దేహమున్ = శరీరము గల దానిని; చకిత = భయపెట్టబడిన; వన్య = అడవి; ఇభ = ఏనుగు; ఇంద్ర = శ్రేష్ఠముల; సందోహమున్ = సమూహము గల దానిని; కామ = కామము; క్రోధన = క్రోధములకు; గేహమున్ = నివాస మైన దానిని; కరటి = ఏనుగు యొక్క; రక్త = రక్తపు; స్రావ = ధారల యందు; గాహంబున్ = మునిగిన దానిని; నిస్సీమ = అంతులేని; ఉత్సాహమున్ = ఉత్సాహము గల దానిని; వీత = పోయిన; దాహమున్ = ఆయాసము గల దానిని; జయ = విజయ మనెడి; శ్రీ = సంపద యందు; మోహమున్ = మోహము గల దానిని; గ్రాహమున్ = మొసలిని.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: