హంతవ్యుడు
7-189-క.
హంతవ్యుఁడు రక్షింపను
మంతవ్యుఁడు గాడు యముని మందిరమునకున్
గంతవ్యుఁడు వధమున కుప
రంతవ్యుం డనక చంపి రం డీ పడుచున్.
ఈ పిల్లాడు చంపదగినవాడు కాని రక్షింప దగినవాడు
కాదు. చిన్న కుర్రాడిని చంపడం ఎందుకని ఆలోచించంకండి. యమలోకానికి పంపదగినవాడు కనుక
వెంటనే ప్రహ్లాదుడిని చంపేసి రండి.
అని హిరణ్యకశిపుడు తన రాక్షసభటులను ఆజ్ఞాపిస్తున్నాడు.
7-189-ka.
haMtavyu@MDu
rakshiMpanu
maMtavyu@MDu
gaaDu yamuni maMdiramunakun
gaMtavyu@MDu
vadhamuna kupa
raMtavyuM
Danaka chaMpi raM Dee paDuchun.
హంతవ్యుడు = చంప దగినవాడు; రక్షింపను = కాపాడుటకు; మంతవ్యుడు = యోచింప దగినవాడు; కాడు = కాడు; యముని = యముడి యొక్క; మందిరమున్ = ఇంటి; కున్ = కి; గంతవ్యుడు = పోదగినవాడు; వధమున్ = చంపుట; కున్ = కు; ఉపరంతవ్యుడు = మాన దగినవాడు; అనక = అనకుండగ; చంపి = సంహరించి; రండి = రండి; ఈ = ఈ; పడచున్ = పిల్లవానిని.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment