Saturday, April 19, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 263

వ్రతముల్

10.1-1707-మ.
వ్రముల్ దేవ గురు ద్విజన్మ బుధసేల్ దానధర్మాదులున్
జన్మంబుల నీశ్వరున్ హరి జగత్కళ్యాణుఁ గాంక్షించి చే
సితి నేనిన్ వసుదేవనందనుఁడు నా చిత్తేశుఁ డౌఁ గాక ని
ర్జితు లై పోదురుగాక సంగరములోఁ జేదీశముఖ్యాధముల్.
          పూర్వజన్మలలో నేను కనుక సర్వలోకాధీశుడు, సర్వలోకశుభ ప్రదాయుడు నైన గోవిందుడిని పతిగా కావాలని నోములు నోచి ఉంటే; దేవతలకు, గురువులకు, విప్రులకు,జ్ఞానులకు సేవలొనర్చి ఉంటే; దానధర్మాది పుణ్యకార్యాలు ఆచరించి ఉంటే; వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడౌ గాక. శిశుపాలుడు మున్నగు నీచలు అందరు యుద్ధంలో పరాజితు లైపోవు గాక.
రుక్మిణి కృష్ణునికి పంపిన సందేశంలోని చక్కటి పద్యాలలో ఒకటిది.  
10.1-1707-ma.
vratamul daeva guru dvijanma budhasaeval daanadharmaadulun
gatajanmaMbula neeSvarun hari jagatkaLyaaNu@M gaaMkshiMchi chae
siti naenin vasudaevanaMdanu@MDu naa chittaeSu@M Dau@M gaaka ni
rjitu lai pOdurugaaka saMgaramulO@M jaedeeSamukhyaadhamul.
          వ్రతముల్ = నోములు; దేవ = దేవతలను; గురు = పెద్దలను; ద్విజన్మ = విప్రులను; బుధ = ఙ్ఞానులను; సేవల్ = కొలచుటలు; దాన = దానములిచ్చుటలు; ధర్మ = దర్మాచరణములు; ఆదులున్ = మున్నగువానిని; గత = పూర్వ; జన్మంబులన్ = జన్మములలో; ఈశ్వరున్ = సర్వమునేలువాడనిని; హరిన్ = విష్ణమూర్తిని; జగత్ = లోకమునకు; కల్యాణున్ = మేలుచేయువానిని; కాంక్షించి = కావాలని, కోరి; చేసితినేనిన్ = చేసినచో; వసుదేవనందనుడు = కృష్ణుడు {వసుదేవనందనుడు - వసుదేవుని కొడుకు, కృష్ణుడు}; నా = నా యొక్క; చిత్తేశుడు = భర్త {చిత్తేశుడు - మనసునకు ప్రభువు, భర్త}; ఔగాక = అగునుగాక; నిర్జితులు = ఓడిపోయినవారు; ఐపోదురుగాక = అయ్యెదరుగాక; సంగరము = యుద్దము; లోన్ = అందు; చేదీశ = శిశుపాలుడు {చేదీశుడు - చేది దేశపు ప్రభువు, శిశుపాలుడు}; ముఖ్య = మొదలగు; అధముల్ = నీచులు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: