Saturday, April 26, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 271

యవ పద్మాంకుశ

1-344-మ.
పద్మాంకుశ చాప చక్ర ఝష రేఖాలంకృతంబైన మా
వు పాదద్వయ మింక మెట్టెడు పవిత్రత్వంబు నేఁ డాదిగా
నీకాంతకు లేదు పో? మఱి మదీయాంగంబు వామాక్షి బా
హువు లాకంపము నొందుచుండు నిల కేయుగ్రస్థితుల్ వచ్చునో
          నాయనా! భీమసేనా! గింజ-చక్ర-చాప-పద్మ-అంకుశాది శుభరేఖలతో అలంకృత మైన వాసుదేవుని పాదపద్మాల ముద్రలతో పావనమయ్యే అదృష్టం ఇక పైన ఈ భూదేవికి లేదేమో? నా అవయవాలు, ఎడం కన్నూ, ఎడం భుజం మాటిమాటికీ అదురుతున్నాయి. ఈ లోకానికి ఇంకా ఎలాంటి భీకర పరిస్థితులు రానున్నాయో కదా.
ధర్మరాజు దుర్నిమిత్త దుశ్శకునాలను కనుగొని భీమసేనునితో మాట్లాడుతున్నాడు.
1-344-ma.
yava padmaaMkuSa chaapa chakra jhasha raekhaalaMkRtaMbaina maa
dhavu paada dvaya miMka meTTeDu pavitratvaMbu nae@M Daadigaa
navaneekaaMtaku laedu pO? maRi madeeyaaMgaMbu vaamaakshi baa
huvu laakaMpamu noMduchuMDu nila kaeyugrasthitul vachchunO
          యవ = యవలు వంటి (ధాన్యంగింజ వంటి); పద్మ = పద్మముల వంటి; అంకుశ = అంకుశమువం టి {అంకుశము - ఏనుగు కుంభ స్థలమును పొడచుటకు వాడు ఆయుధము}; చాప = ధనుస్సు వంటి; చక్ర = చక్రము వంటి; ఝష = చేప వంటి; రేఖా = రేఖలతో; అలంకృతంబు = అలంకరింపబడినది; ఐన = అయినట్టి; మాధవు = మాధవిభర్త / కృష్ణుని {మాధవుడు – మాధవి భర్త, హరి }; పాద = పాదముల; ద్వయము = జంట; ఇంకన్ = ఇంక; మెట్టెడు = త్రొక్కుట వలని; పవిత్రత్వంబున్ = పవిత్రత కలుగుటలు; నేఁడు = ఈ దినము; ఆదిగాన్ = మొదలెట్టి; అవనీకాంత = భూదేవి; కున్ = కి; లేదు పోమఱి = లేదేమో మరి; మదీయ = నా యొక్క; అంగంబున్ = అవయవములును; వామ = ఎడమ ప్రక్క; అక్షి = కన్నును; బాహువులు = బాహువును; ఆకంపము = అదురుట; ఒందుచుండున్ = కలుగుచున్నది; ఇల = భూమి; కున్ = కి; = ; ఉగ్ర = భయంకరమైన; స్థితుల్ = పరిస్థితులు; వచ్చునో = వచ్చునో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: