Tuesday, April 22, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 266

తరుణి యొకతె

10.1-326-ఆ.
రుణి యొకతె పెరుగుఁ రుచుచుఁ దుది వంగి
వెన్నదీయ నొదిఁగి వెనుకఁ గదిసి
గువ! నీ సుతుండు గపోఁడుములు చేయ
సాఁగినాఁడు తగదె? క్కఁజేయ.
          ఓ యమ్మా! ఒక యువతి పెరుగు చిలుకుతోంది. చివరకి వెన్న తీయడానికి వంగింది. నీ కొడుకు వెనక చేరి కూడని పనులు చేయసాగాడు. కొంచం బుద్ధి చెప్పరాదా?
ఇలా అనేక విధాల బాల కృష్ణుని దుడుకు పనులు గోపికలు ఓపికలు లేక వచ్చి తల్లి యశోదకి చెప్తున్నారు. స్త్రీ బాలాంధజడోపమా అంటారు కదా అలా ఉండి, పెరుగు అనే జ్ఞానం పేరుకున్న వేదాలు చిలికిచిలికి, వెన్న అనే సారం తీయడానికి ప్రయత్నిస్తే సరిపోదు. భక్తి లేనిచో వ్యర్థమని పరమాత్మ వెనుతగిలి మగపోడుమ లనే సరైన పురుషయత్నం చూపుతున్నాడట.
10.1-326-aa.
taruNi yokate perugu@M daruchuchu@M dudi vaMgi
vennadeeya nodi@Mgi venuka@M gadisi
maguva! nee sutuMDu magapO@MDumulu chaeya
saa@Mginaa@MDu tagade? chakka@Mjaeya.
          తరుణి = పడతి {తరుణి - తరుణవయసుస్త్రీ}; ఒకతె = ఒకామె; పెరుగున్ = పెరుగును; తరచుచున్ = చిలుకుతూ; తుదిన్ = ఆఖరున; వంగి = వంగొని; వెన్నన్ = వెన్ను; తీయన్ = తీయుచుండగా; ఒదిగి = పొంచియుండి; వెనుకన్ = వెనుకవైపు; కదిసి = చేరి; మగువ = ఇంతి; నీ = నీ యొక్క; సుతుండు = పుత్రుడు; మగపోడుములు = పోకిరీవేషములు; చేయసాగినాడు = చేయుటమొదలెట్టెను; తగదె = ఉచితముకాదా, అవును; చక్కజేయన్ = సరిదిద్దుట.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: